newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

సీటు మార్చుకున్న స్పీకర్ కోడెల

07-03-201907-03-2019 07:16:06 IST
Updated On 08-03-2019 19:06:46 ISTUpdated On 08-03-20192019-03-07T01:46:06.841Z07-03-2019 2019-03-07T01:46:00.025Z - 2019-03-08T13:36:46.445Z - 08-03-2019

సీటు మార్చుకున్న స్పీకర్ కోడెల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 924 ఓట్లతో గెలుపొందారు కోడెల శివప్రసాదరావు. అది కూడా ప్రత్యర్థి అంబటి రాంబాబు చేతులారా చేసుకున్న తప్పిదం... ఆయనకు కల్సొచ్చింది. అయితే గెలిచిన తర్వాత సత్తెనపల్లి మొహం చూడలేదని అక్కడి జనం ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా సత్తెనపల్లిలో జనం కోడెలకు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు. వీళ్లే కాదు స్థానిక టీడీపీ కార్యకర్తలు కూడా కోడెల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

తాజా పరిస్థితులను అర్థం చేసుకున్న కోడెల శివప్రసాదరావు... సత్తెనపల్లి సీటు నుంచి పోటీ చేయనని చంద్రబాబుకు నిక్కచ్చిగా చెప్పారట. తన సొంత నియోజకవర్గం నర్సరావుపేట నుంచి బరిలో దిగుతానని స్పష్టం చేశారట. అయితే దీనికి చంద్రబాబు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కోడెల నిర్ణయించుకున్నారు.  అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి... కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని కోడెల తెగేసి చెప్పారని ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. 

దీంతో కంగుతిన్న చంద్రబాబు... పల్నాడులో పట్టున్న నేతను వదులు కోవడానికి ఇష్టపడలేదు. దీంతో మధ్యే మార్గంగా కోడెల శివప్రసాద్‌ను నర్సరావుపేట లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అయితే తాను నర్సరావుపేట లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయడానికి సిద్ధమేననీ... కాకపోతే తన కుమారుడు శివరాంకు నర్సరావుపేట అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని కోడెల శివప్రసాద్ మెలిక పెట్టారు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోడెల ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చెప్పారంటున్నారు. ఎందుకంటే నర్సరావుపేటలో కోడెలకు బలమైన వర్గం ఉంది. దీంతో ఆయన కుమారుడు శివరాం గెలవడం ఖాయం. అంటే... శివరాంకు లైన్ క్లియర్ చేస్తే... తాను గెలిచినా, ఓడినా పెద్ద పట్టింపు ఉండదన్న ఆలోచనకు కోడెల వచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle