newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

సీకే బాబును వెంటాడుతున్న‌ పొలిటిక‌ల్ క్లైమాక్స్ సీన్స్‌..!

25-10-201925-10-2019 16:20:29 IST
2019-10-25T10:50:29.117Z25-10-2019 2019-10-25T10:50:23.082Z - - 15-12-2019

సీకే బాబును వెంటాడుతున్న‌ పొలిటిక‌ల్ క్లైమాక్స్ సీన్స్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్రదేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన దాదాపు ఐదు నెల‌లు కావొస్తోంది. అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప‌రిపాల‌ను కొన‌సాగిస్తోంది. కానీ, ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారిన రాజ‌కీయ‌ నేత‌ల‌కు ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితినే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఎదుర్కొంటున్నాడు. అయితే రాజకీయాల‌ను దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు పైగానే శాశించిన నేత‌గా అలాగే మాస్ లీడర్‌గా సీకే బాబుకు గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.

1985లో ఏ కండువా వేసుకోకుండానే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన సీకే మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా, ఆ త‌రువాత చైర్మ‌న్‌గా రాజ‌కీయాల్లో రాణించారు. 1989లో ఇండిపెండెంట్‌గా, ఆ త‌రువాత 1994లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లోను సీకే విజ‌యం సాధించారు.

2004లో ఓడిపోయిన త‌రువాత తిరిగి 2009లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్ మృతితో సీకే రాజ‌కీయ భ‌విష్య‌త్ అంధ‌కారంగా మారింది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్‌కు దూర‌మైన సీకే 2014లో పోటీ చేసేందుకు ఏ పార్టీ దొర‌క‌లేదు. చివ‌ర‌కు వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్య‌ర్ధి కోసం ప‌ని చేయాల్సి వ‌చ్చింది.

ఆ త‌రువాత రాజ‌కీయ ఉనికిని కాపాడుకునేందుకు కండువా మార్చారు. బీజేపీలో చేరారు. అక్క‌డా చేసేదేమీ లేక తిరిగి వైసీపీలోకి వ‌చ్చేందుకు `విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి బ్రేకులు వేయ‌డంతో బీజేపీలో ఉండ‌లేక వైసీపీలోకి వెళ్లే దారిలేక సీకే బాబు ఇబ్బందులు ప‌డ్డారు.

చివ‌ర‌కు 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిపోయారు. చిత్తూరుతోపాటు పూత‌ల‌ప‌ట్టు, గంగాధ‌ర్ నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపుకోసం సీకే బాబు శ్ర‌మించారు. కానీ, వైసీపీ ప్ర‌భంజ‌నంలో సీకే పాచిక‌లు పార‌లేదు.

టీడీపీలో ఏం చేయాలో తెలీక ఇప్పుడు సీకే వ‌ర్గం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎటుపోవాలో తెలీక డైలమాలో ప‌డింది. వైసీపీలోకి వెళ్లే అవ‌కాశం లేదు. మ‌రోవైపు టీడీపీలోనూ యాక్టివ్‌గా లేని సీకే ఏం చేస్తార‌ని ఆయ‌న అనుచ‌రులు ఎదురు చూస్తున్నారు. ఒక‌ప్పుడు చిత్తూరు రాజ‌కీయాల‌ను శాశించిన సీకే పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ లేక‌పోవ‌డం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle