newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

సీఏఏతో ముస్లింలకు ఇబ్బందులుండవు

05-01-202005-01-2020 09:57:38 IST
Updated On 08-01-2020 14:15:24 ISTUpdated On 08-01-20202020-01-05T04:27:38.778Z05-01-2020 2020-01-05T04:27:35.380Z - 2020-01-08T08:45:24.071Z - 08-01-2020

సీఏఏతో ముస్లింలకు ఇబ్బందులుండవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశం లోని ముస్లింలకు ఎలాంటి సమస్యలుండవు. పొరుగు దేశాలలో మతపరమైన అణచివేతకు, అత్యాచారాలకు గురై, ప్రాణాలరచేతబెట్టుకొని, మన దేశానికి వచ్చిన వారికి అన్ని విధాలా రక్షణ కల్పించేందుకే ఈ చట్టం తీసుకొచ్చామన్నారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు పరివర్తన తీసుకొచ్చిన నరేంద్ర మోడీ..దేశరక్షణ కోసమే  చట్టాలు తెచ్చారన్నారు.కడపలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 

సీఏఏ నిరసనల పేరుతో దేశంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విషయంలొ అప్రమత్తంగా ఉండాలన్నారు. భారత భూభాగమైన కాశ్మీర్ లో 390 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత మోడీ దే అన్నారు.

మైనారిటీ దేశాల్లో అమలు చేయని త్రిబుల్ తలాక్ చట్టాన్ని మనమే తెచ్చామని, ముస్లిం మహిళలకు ఈ చట్టం రక్షణ ఇస్తుందన్నారు గజేంద్ర సింగ్ షెకావత్. భారతదేశ భద్రత కోసం చట్టాలను తెస్తే వ్యతిరేకించడం తగదని, పాకిస్థాన్ లో హిందువులను ఉండనివ్వడం లేదన్నారు.

పాకిస్థాన్ లో పది లక్షల మంది శరణార్ధులుగా ఉన్నారని, సిటిజన్ షిప్  కోసం 11ఏళ్ళ పాటు వేచిఉండాల్సి ఉందన్నారు. పౌరసత్వం కోసం  11ఏళ్ళుగా ఎదురు చూస్తున్న శరణార్థులు ఎలాంటి గుర్తింపు కార్డులు లేక పిల్లలను చదివించుకోలేక పోతున్నారన్నారు. మమతా బెనర్జీ వెంట నడుస్తున్న రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మైనారిటీ వర్గాల్లో దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు గ్రహించాలన్నారు.

సీఏఏ చట్టంపై వాస్తవాలను తెలియజేసేందుకు ఇంటింటి వెళ్తాం అన్నారు మాజీ కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి. సిఎఎకి మద్దతు తెలిపేందుకు 8866288662 కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. పది కోట్ల మంది ప్రజల మద్దతు ఉంటే మమతా, రాహుల్, ఎంఐఎం పార్టీ ఏమీ చేయలేరన్నారు. విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ కి వినిపించేలా భారత్ మాతకు జై అని నినాదాలు చేయాలన్నారు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, నాయకులు సునీల్‌ దేవధర్‌, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌, రాష్ట్ర కార్యదర్శి మధుకర్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle