newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

సీఎస్ vs చంద్రబాబు: ఏపీలో కోల్డ్ వార్

21-04-201921-04-2019 08:51:06 IST
2019-04-21T03:21:06.679Z21-04-2019 2019-04-21T03:20:59.155Z - - 21-11-2019

సీఎస్ vs చంద్రబాబు: ఏపీలో కోల్డ్ వార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజు సివిల్ సర్వీసెస్ డే. పరిపాలనలో ప్రజాప్రతినిధులను నడిపించేది బ్యూరోక్రాట్లే. అయితే ఎన్నికల పుణ్యమాని వీళ్లిద్దరి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా నానుతున్న పదం. ఎన్నికలు ముగిసిన రోజునుంచీ ప్రతిరోజూ ఈసీతో నువ్వానేనా? అన్నట్టుగా మాటల యుద్ధం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఎన్నికల వేళ సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంని నియమించడంతో బాబు ఆయనపై నేరుగా విమర్శలు చేశారు. ఆయన జగన్ సహనిందితుడని పనిలో పనిగా ఆరోపణలు చేశారు. దీనిపై సీనియర్, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారం రాజ్ భవన్ మెట్లెక్కింది.

ఇదిలా ఉంటే ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ఎటువంటి ప్రకటనగాని. ఏ సమావేశంగాని ఏవిధమైన ఆదేశాలు ఎలాంటి జీఓలు జారీచేయకూడదని ఈసీ నిబంధనలు ఉన్నాయి. అయితే టీడీపీ ప్రభుత్వం పోలింగ్ అనంతరం జారీ చేసిన 18 జీఓలను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రద్దు చేసారు.

అదే సమయంలో  బాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులకు ఈసీ నుంచి సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు అందాయి.  కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో తాను జరపాలని తలపెట్టిన హోమ్ శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రద్దు చేసిన జీవోల్లో అత్యధికంగా వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులవేనని తెలుస్తోంది. 

తన అనుమతి లేకుండా చంద్రబాబు నిర్వహించే ఏ సమావేశాలకు ఎవరూ వెళ్లకూడదని సీఎస్ ఆదేశాలు జారీచేశారు. డీజీపీకి సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఏపీలో ఏ నిర్ణయమైనా తనకు తెలియాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఏ పని మీద కూడా అధికారులు చంద్రబాబును కలవకూడదని కూడా ఆయన చెప్పారు. ఏదైనా విషయం ఉంటే చంద్రబాబు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయాల్సి ఉంటుందని, ఆ అధికారి ఆ విషయాన్ని తన దృష్టికి తెస్తారని ఆయన చెప్పారు. విషయాన్ని బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. మొత్తం మీద ఏపీ సీఎం, సీఎస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరో నెలరోజుల వరకూ ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle