newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

సీఎస్ జారీచేసిన ఒక్క జీవో: ఖజానాకు వేలకోట్లు ఆదా

01-06-201901-06-2019 15:17:39 IST
Updated On 01-06-2019 17:50:42 ISTUpdated On 01-06-20192019-06-01T09:47:39.217Z01-06-2019 2019-06-01T09:47:35.655Z - 2019-06-01T12:20:42.395Z - 01-06-2019

సీఎస్ జారీచేసిన ఒక్క జీవో: ఖజానాకు వేలకోట్లు ఆదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా నిర్ణయాలు పాలనలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తున్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి ముందు ఒక్క యువో నోట్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఖజానాను ఆదుకున్నారు. మే 29వ తేదీతో విడుదలైన ఈ ఆదేశాలలో అనేక అంశాలున్నాయి. ఏప్రిల్ 1, 2019 కంటే ముందు శాంక్షన్ అయిన ఇంజనీరింగ్ పనులు క్షేత్రస్థాయిలో ఇంకా ప్రారంభం కాకుంటే వాటిని రద్దుచేస్తామని అందులో పొందుపరిచారు.

మళ్ళీ తిరిగి వాటికి టెండర్లు పిలుస్తామన్నారు. వివిధ విభాగాలకు సంబంధించి  25 శాతం పనులు పూర్తయితే మిగిలిన కాంట్రాక్ట్ పనులను మళ్ళీ అంచనా వేస్తామని ప్రకటించారు. వాటికి అనుగుణంగా మళ్లీ మదింపు చేసి కొత్త అంచనా ప్రకారం డబ్బులు చెల్లిస్తామన్నారు. దీంతో అనేక చెల్లింపులు ఆగిపోయాయి. 

ఈ ఆదేశాల ప్రభావం పోలవరం, ఇతర ఇంజనీరింగ్ పనులపై కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం పొదుపు చర్యలు, వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ ఆదేశం జారీచేసిందని నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కార్యరంగంలోకి దిగారు. ఈ యువో నోట్ కారణంగా ఖజానాకు వేలకోట్ల రూపాయలు వెసులుబాటు కలిగింది. చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఖజానాను ఖాళీచేసేశారు.

వేలకోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు శాంక్షన్ చేసేశారు. దీంతో ఖజానాకు చేరే ఆదాయం కంటే వ్యయం భారీగా పెరిగిపోయింది. జగన్ అధికారం చేపట్టేనాటికి ఖజానా ఒట్టికుండలా మారింది. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, కాంట్రాక్టర్ల పనులకు సుమారు 30 వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. దీంతో ఖజానా ఖాళీ అయింది. 

ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీచేసిన ఈ ఆదేశాల కారణంగా ఖజానా ఊపిరి పీల్చుకుంది. వివిధ పనులకు చెల్లించాల్సిన వేలకోట్ల రూపాయలు ఆగిపోయాయి. సుమారుగా 50 వేల కోట్లరూపాయలు చెల్లింపులు ఆగిపోవడంతో.. నిధుల కోసం వేచి చూస్తున్న వివిధ విభాగాలకు రిలీఫ్ లభించింది. 8 వేల కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్, 25 వేల కోట్ల రూపాయలు తక్షణం చెల్లించాల్సిన బకాయిలు ఇప్పట్లో చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందని, దీంతో ఖజానాపై తాత్కాలిక భారం తగ్గిందని అమరావతిలో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్న వేళ సీఎస్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఆడంబరాలకు, ప్రచార పటాటోపాలకు అడ్రస్ కాకూడదని, వ్యయనియంత్రణ ద్వారా కూడా సరైన పాలన సాగించవచ్చని జగన్ నిరూపించారని అంటున్నారు.

జీతాల చెల్లింపుల కోసం ప్రతినెలా చివరిలో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ముందు మోకరిల్లేది. చేబదులు తెచ్చి మళ్ళీ అది తీర్చడానికి కొత్త అప్పుల వెంట పడేది. తాజాగా తీసుకు వచ్చిన ఆదేశాలతో ఈ బాధ తప్పిందని, కొంతలో కొంత ఆర్థిక శాఖకు ఉపశమనం కలిగిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

గత ఐదేళ్ళలో ప్రభుత్వం వివిధ పథకాల కోసం రూ 2లక్షల 50 వేల కోట్లకు పైగా అప్సులు చేసింది గత ప్రభుత్వం. ఈ అప్పుల ఊబినుంచి బయటపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ, వ్యయనియంత్రణ తప్పదని ఆర్థిక శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎస్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో కాంట్రాక్టులు దక్కించుకున్నవారు మాత్రం ఇది కక్షసాధింపుచర్యేనని, దీనివల్ల తాము మునిగిపోతామని వారంతా అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. 

ఈ ఆదేశాల ప్రభావం ఎలా ఉంటుందో.. ‘న్యూస్ స్టింగ్’ మే 30వ తేదీన ప్రత్యేక కథనం జగన్ మార్కు పాలన.. వ్యయ నియంత్రణ అందించింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్యల వల్ల ఖజానాకు లాభం కలుగుతుందని విశ్లేషించింది. ఈ కథనంలో చెప్పినట్టుగానే ఫలితాలు కనిపిస్తున్నాయి. 

Image may contain: 3 people, including జైసింహ ఉవాచ, text


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle