newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

సీఎస్ ఎల్వీ..గుంటూరు హెచ్ఆర్డీకి బదిలీ

04-11-201904-11-2019 17:37:21 IST
Updated On 04-11-2019 18:01:39 ISTUpdated On 04-11-20192019-11-04T12:07:21.808Z04-11-2019 2019-11-04T12:06:14.706Z - 2019-11-04T12:31:39.124Z - 04-11-2019

సీఎస్ ఎల్వీ..గుంటూరు హెచ్ఆర్డీకి బదిలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ప్రిన్స్‌పల్ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌‌కు సీఎస్ హోదాలో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ జారీ చేయడం తెలిసిందే. దీనికి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కేబినెట్‌ అజెండాలో పెట్టే అంశాలను సీఎస్ ఆమోదం లేకుండా నేరుగా ఎజెండాలో చేర్చడం ఏపీ బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకమని, విధివిధానాలు పాటించలేదని.. పైగా సీఎస్ ఆమోదం లేకుండా ఎలా చేస్తారని ఎల్వీ ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 

ఈ విషయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం వేగంగా స్పందించారని అంటున్నారు. సీఎం జగన్‌కు తెలియకుండానే ఎల్వీ.. ప్రవీణ్‌ ప్రకాష్‌‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారని, దాని ఫలితమే బదిలీ అని తెలుస్తోంది. ఇన్‌చార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్ కొనసాగేలా ఆదేశాలు జారీ చేయడం వెనుక ఏం జరిగిందనేది ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. 

1983 బ్యాచ్ కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు  కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసింది.

ఎన్నికల అనంతరం జగన్ సీఎం అయ్యాక కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్నికొనసాగించారు. జగన్-ఎల్వీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక్క షోకాజ్ అంశమే వారి మధ్య అగాధం సృష్టించిందని అంటున్నారు. మరో ఐదునెలలు సర్వీసు ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు.  సీఎస్‌ రేసులో నీలం సహాని, సమీర్‌ శర్మ ఉన్నట్టు తెలుస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle