newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

సీఎం వైఎస్ జగన్‌కి జీఎన్ రావు కమిటీ నివేదిక

20-12-201920-12-2019 16:34:23 IST
2019-12-20T11:04:23.292Z20-12-2019 2019-12-20T11:04:20.490Z - - 19-01-2020

సీఎం వైఎస్ జగన్‌కి జీఎన్ రావు కమిటీ నివేదిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీకి మూడు రాజధానులు అవసరం అవుతాయని సీఎం జగన్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై టీడీపీ, జనసేన, ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి.సీఎం జగన్ తో జీఎన్ రావు కమిటీ భేటీ శుక్రవారం భేటీ అయింది.

రాజధానిపై నివేదిక అందచేసింది కమిటీ. నివేదికలోని అంశాలను సీఎం జగన్ కు వివరించింది కమిటీ. డిసెంబర్ 27న జరిగే క్యాబినెట్ భేటీలో కమిటీ నివేదికపై చర్చ జరగనుంది. ఈ క్యాబినెట్ ఆమోదం తరువాత నివేదిక బహిర్గతం చేస్తారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు కమిటీ భేటీ అయింది. కమిటీ తుదినివేదికను సీఎంకి వివరించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలనుంచి సూచనలు, సలహాలు తీసుకుంది. రాజధాని ఎక్కడ ఉండాలనేదానిపై ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చింది జీఎన్ రావు కమిటీ. 40వేల వినతులు కమిటీకి అందాయి.

ఏ ప్రాంతంలో ఏ కార్యాలయం ఉండాలో కమిటీ ఇందులో పొందుపరిచింది. ఈనివేదిక వెల్లడికాకముందే జగన్ మూడు ప్రాంతాల్లో రాజధానులు వస్తాయని శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. హైకోర్టు కర్నూలులో, సెక్రటేరియట్ విశాఖలో, అసెంబ్లీ అమరావతిలో ఉండవచ్చని తెలిపిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ కమిటీ నివేదికలో ఏఏ అంశాలు ఉన్నాయో వారం తర్వాత వెల్లడి కానుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle