newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

సీఎం జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహం..!

18-10-201918-10-2019 10:16:45 IST
Updated On 18-10-2019 14:55:01 ISTUpdated On 18-10-20192019-10-18T04:46:45.626Z18-10-2019 2019-10-18T04:46:43.633Z - 2019-10-18T09:25:01.162Z - 18-10-2019

సీఎం జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌త కొంత కాలం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మీడియా సంస్థ‌లు సైతం పొలిటిక‌ల్ పార్టీల మాదిరిగానే నిత్యం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాయి. మీడియా కూడా పొలిటిక‌ల్‌గా రెండుగా చీలిపోయింది. మీడియా సంస్థ‌లు త‌మ‌కు అనుకూల‌మైన పార్టీల‌కు ర‌క్ష‌ణ ద‌ళంగా ప‌నిచేస్తున్నాయ‌న్న విమ‌ర్శ కూడా బాగానే వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ద‌శాబ్దాలుగా తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థ‌లు బాగా పాతుకుపోయాయ‌న్న విమర్శ వైసీపీ నుంచి బాగా వినిపిస్తున్న మాట‌.

చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం హ‌యాంలో ఎంత పెద్ద కుంభ‌కోణం జ‌రిగినా అది ప్ర‌జా శ్రేయ‌స్సు కోస‌మే జ‌రిగిన‌ట్టు న‌మ్మించే కొన్ని ప‌త్రిక‌లు, టీవీ ఛానెళ్లు. టీడీపీ కాకుండా మ‌రొక పార్టీ అధికారంలోకి వ‌స్తే మాత్రం ఆ మ‌రుక్ష‌ణం నుంచే విరుచుకుప‌డుతుంటాయి అన్న విమ‌ర్శ కూడా ఆ మీడియా సంస్థ‌ల‌పై ఉంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ అదే జ‌రుగుతుంది.

కొత్త ప్ర‌భుత్వాన్ని చిన్న చిన్న అంశాల ఆధారంగా బ‌ద‌నం చేసేందుకు కొన్ని ప‌త్రిక‌లు, టీవీ ఛానెళ్లు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తున్నాయ‌న్న ఆగ్ర‌హం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌నిక‌ట్టుకుని త‌ప్పుడు క‌థ‌నాలు రాసే వార్తా సంస్థ‌ల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ కేబినేట్ భేటీ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ అంశం ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు గ‌డిచిన నాలుగు నెల‌ల్లో కొన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌చురించిన‌, ప్ర‌సారం చేసిన క‌థ‌నాల‌పై మంత్రుల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌ధానంగా టీడీపీకి అనుకూల‌మైనదిగా పేరున్న ఓ ప‌త్రిక ప‌దే ప‌దే ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తుంద‌ని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఎంతో ప‌క‌డ్బంధీగా స‌చివాల‌య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ ప్ర‌శ్నాప‌త్రం లీకైందంటూ స‌ద‌రు ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నాన్ని మంత్రులు గుర్తు చేసుకున్నారు.

ఆర్టీసీ ఎండీ సురేంద్ర‌బాబును బ‌దిలీచేసిన స‌మ‌యంలో అదే ప‌త్రిక సురేంద్ర‌బాబు బ‌దిలీకి ఆర్టీసీ విద్యుత్ బ‌స్సుల‌కు లింక్ పెడుతూ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లేలా క‌థ‌నాల‌ను ప్ర‌చురించ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అది పూర్తిగా త‌ప్పుడు క‌థ‌న‌మంటూ స‌రేంద్ర‌బాబు ఖండ‌న విడుదల చేసినా దానిని స‌రిగ్గా ప్ర‌చురించ‌లేద‌ని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇలా ప‌నిక‌ట్టుకుని కొన్ని ప‌త్రిక‌లు త‌ప్పుడు క‌థ‌నాల‌ను రాస్తున్నందున ఇక‌పై అలాంటి సంస్థ‌ల‌పై కేసులు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఆ రెండు ప‌త్రిక‌లు ఇలానే క‌థ‌నాలను రాసేవి. దాంతో వైఎస్ హ‌యాంలో త‌ప్పుడు క‌థ‌నాలు రాసే ప‌త్రిక‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు ఒక జీవోను కూడా తెచ్చారు. కానీ, జ‌ర్న‌లిస్టు సంఘాల నుంచి తీవ్ర‌స్థాయి ఒత్తిడి రావ‌డంతో వైఎస్ ప్ర‌భుత్వం ఆ జీవోను అమ‌లు చేయ‌లేదు.

కానీ, ఈ సారి ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు. ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా త‌ప్పుడు క‌థ‌నాలు రాసే మీడియాల విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌కూడ‌ద‌న్న కృత నిశ్చయంతోని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుగా క‌నిపిస్తుంది. త‌ప్పుడు క‌థ‌నాలు రాసే మీడియా సంస్థ‌ల‌పై కేసులు వేసే అధికారాన్ని వైఎస్ హ‌యాంలో స‌మాచార‌, పౌర‌సంబంధాల‌శాఖకు అప్ప‌గించారు.

కానీ, ఇప్ప‌టి ప్ర‌భుత్వం మాత్రం త‌ప్పుడు క‌థ‌నాల‌పై కేసులు వేసే అధికారాన్ని ఆయాశాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శుల‌కు అప్ప‌గించింది. త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురిస్తే తొలుత ఖండ‌న ఇవ్వాల‌ని, అప్ప‌టికీ స‌ద‌రు మీడియా సంస్థ‌లు స‌రైన రీతిలో స్పందించ‌క‌పోతే కేసులు వేయాల‌ని అధికారుల‌కు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. 

 

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle