newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

18-11-201918-11-2019 16:40:00 IST
2019-11-18T11:10:00.035Z18-11-2019 2019-11-18T11:09:51.407Z - - 15-12-2019

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అత్యంత వ్యూహాత్మ‌కంగా సాగుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి వ‌చ్చే ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను పార్టీలో చేర్చుకోకుండా.. కేవ‌లం త‌మ‌కు మాత్ర‌మే అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్న ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాజీలు, ద్వితీయ శ్రేణి నేత‌ల విష‌యంలో మాత్రం చేరిక‌ల‌కు సై అనేస్తున్నారు. తాజాగా, టీడీపీ నుంచి వ‌చ్చిన దేవినేని అవినాష్‌తోపాటు మ‌రికొంద‌రు నేత‌ల‌కు కండువాక‌ప్పిన జ‌గ‌న్ వంశీ విష‌యంలో మాత్రం త‌న వ్యూహం ప్ర‌కార‌మే ముందుకు సాగుతున్న‌ట్లు అర్ధ‌మ‌వుతుంది.

టీడీపీకి చెందిన కీల‌క నేత‌ల‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జ‌గ‌న్ మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచిన ప్ర‌జా ప్ర‌తినిధుల విష‌యంలో మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వారిని పార్టీలోకి చేర్చుకుంటే త‌మ సిద్ధాంతాల ప్ర‌కారం రాజీనామా చేయించాల్సిన ప‌రిస్థితి ఉండ‌టంతో కేవ‌లం టీడీపీకి దూరం చేయ‌డంపైనే దృష్టి సారిస్తున్నారు. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీనే.

గ‌త నెల‌లో పార్టీతో విభేదిస్తూ అధినేత చంద్ర‌బాబుకు రాజీనామా లేఖ‌ను పంపిన వంశీ వైసీపీలో చేర‌క‌పోవ‌డం వెనుక వ్యూహం ఇదేన‌ని చెబుతున్నారు. టీడీపీకి రాజీనామా చేశాక పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ అటు వైసీపీలో కూడా చేర‌కుండా ఉండిపోవ‌డ‌మే ఈ వ్యూహం.

దీనివ‌ల్ల ఎమ్మెల్యే ప‌ద‌విపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా ఉండ‌టంతోపాటు పాత కేసుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డం ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే నిధుల విష‌యంలో ఎలాంటి కోత‌లు లేక‌పోవ‌డం వంటి ఫ‌లితాలు ఉంటాయ‌ని ఆశిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

వాస్త‌వానికి టీడీపీకి వంశీ గుడ్‌బై చెప్పిన త‌రువాత కొద్ది రోజుల్లోనే వైసీపీలో చేరుతార‌ని, అంతా ఊహించారు. కానీ, ఆ అంచ‌నాల‌కు భిన్నంగా ఆయన ఇప్ప‌టికీ వైసీపీలో చేర‌కుండా మౌనంగా ఉండిపోయారు.

ఇవాళ మీడియా ముందుకొచ్చినా త్వ‌ర‌లో వైసీపీలో చేరుతాన‌ని మాత్ర‌మే ప్ర‌క‌టించారు. ఎప్పుడు చేరేది వెల్ల‌డించ‌లేదు. అంత‌టితో ఆగ‌కుండా గ‌తానికి భిన్నంగా వైసీపీ ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్ధిస్తూ టీడీపీ అధినేత చంద్ర‌బాబును, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌పై వంశీ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగారు. దీన్నిబ‌ట్టి చూస్తే రాబోయే ఐదేళ్ల‌లో ఇదే ప‌రిస్థితి ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది.

అంతేకాకుండా భ‌విష్య‌త్తులో ఇత‌ర విప‌క్ష పార్టీల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ఎమ్మెల్యేల వ్యూహం కూడా ఇలానే ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌భుత్వ పెద్దల నుంచి అందుతున్న సంకేతాల మేర‌కు వీరు ఈ వ్యూహాన్ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తుంది.

ఎందుకంటే..? ప‌్ర‌స్తుతం టీడీపీ లేదా జ‌న‌సేన‌లో ఉంటూ, పాత కేసులు ఎదుర్కొంటూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌దాడి చేయ‌లేక, అటు నిధులు కూడా తెచ్చుకోలేక తాము ఇబ్బందులుప‌డుతూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను సైతం ఇబ్బంది పెట్ట‌డం ఎందుక‌న్న వాద‌న వీరి నుంచి వినిపిస్తుంది.

దీంతో ఐదేళ్ల‌పాటు త‌మ సొంత పార్టీల‌కు దూరంగా ఉంటూ అలాగ‌ని వైసీపీలో చేర‌కుండా కేవ‌లం బయట నుంచి వచ్చే మ‌ద్ద‌తుతోనే త‌మ ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. అయితే, ఈ వ్యూహాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు వంశీపై ఇప్ప‌టి వ‌ర‌కు నేరుగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా మౌనంగా ఉంటున్నారు. వంశీ నుంచి విమ‌ర్శ‌ల‌ దాడి పెరిగితే మాత్రం టీడీపీ స్పందించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle