newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

30-12-201930-12-2019 15:39:17 IST
2019-12-30T10:09:17.582Z30-12-2019 2019-12-30T10:08:51.197Z - - 20-01-2020

సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఒక‌ప‌క్క రాజ‌ధాని అంశం, మ‌రోప‌క్క అవినీతి అంశం రాష్ట్ర రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండింటి మ‌ధ్య‌న జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న విద్యా దోపిడికి సంబంధించిన అంశం కావ‌డం విశేషం.

అయితే, ఏపీలో విద్యా దోపిడి ఏ రేంజ్‌లో ఉందో అంద‌రికి విధిత‌మే. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు వారి వారి పిల్ల‌ల‌ను ప్ర‌యివేటు స్కూళ్ల‌కు పంపాల‌న్న ఆలోచ‌న చేసేందుకు కూడా భ‌య‌ప‌డే ప‌రిస్థితి. వంద‌లో రూ.30 ఇంటి అద్దెల‌కుపోను, మిగిలిన రూ.40 తమ పిల్ల‌ల చ‌దువు నిమిత్తం స్కూళ్ల‌కు ఫీజుల రూపంలో చెల్లించాల్సిందే. పిల్లల భ‌విష్య‌త్తే త‌మ జీవితంగా భావించే మ‌ధ్య త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రులు అప్పులు చేసైనా చ‌దివించుకోవాల్సిన ప‌రిస్థితి.

ఈ క్ర‌మంలో ఫీజుల నియంత్ర‌ణ కమిటీని ఏర్పాటు చేసి, దానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ స‌ర్కార్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌యివేటు విద్య నిలువెత్తు దోపిడీకి నిద‌ర్శంగా మారిన నేప‌థ్యంలో త్వ‌ర‌లో ఫీజుల‌ను ఫిక్స్ చేయ‌నుంది ప్ర‌భుత్వం. స్కూళ్ల‌తోపాటు, క‌ళాశాల‌ల్లో ఈ ఫీజుల రేట్లు త్వ‌ర‌లో అమ‌లు కానున్నాయి. స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఫీజుల నియంత్ర‌ణ కమిటీ ఏర్పాటు త‌రువాత వెల‌వ‌డ‌నున్నాయి.

అయితే, ఫీజు వ‌సూళ్ల‌ను గ్రేడ్‌ల‌ వారీగా చేసి ఏ, బీ, సీ, డీలుగా చేస్తారా..?  లేక రాష్ట్ర మొత్తం ఉన్న ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో ప‌లాన మొత్తానికి మంచి ఫీజులు వ‌సూలు చేయ‌కూడ‌దు అంటూ ఆదేశాలు జారీ చేస్తారా..? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ఫీజుల నియంత్ర‌ణ కమిటీకి స‌మ‌గ్ర‌మైన‌టువంటి అధికారాలు ఇస్తే, రానున్న రోజుల్లో స్కూళ్లు, క‌ళాశాల‌ల్లో ఫీజులు త‌గ్గించేట‌టువంటి ప్ర‌య‌త్నానికి తొలి అడుగు ప‌డింద‌ని అభిప్రాయ‌ప‌డొచ్చు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు గ‌తంలో ఇలాంటి ప్ర‌తిపాద‌న‌నే తెరమీద‌కు తీసుకొచ్చినా ఆచ‌ర‌ణ‌లో వెనుక‌బ‌డింది. అయితే, స‌ర్కార్ నిర్ణ‌యించిన ఫీజుల‌తో ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల‌ను న‌డ‌ప‌లేక మూసేసిన యాజ‌మాన్యాలు చాలానే ఉన్నాయి. చిన్న కళాశాల‌ల్లో ఫీజులు త‌క్కువగాను, పెద్ద పెద్ద కాలేజీల్లో ఫీజులు ఎక్కువ‌గానూ ఉంచారు. దీంతో ఆ క‌ళాశాల‌లు ఒక‌ ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే రేషియోలో మెయింటెన్ చేశారు. ఇలా చేయ‌డం వ‌ల్ల కొంత మొత్తం మ‌ధ్య త‌ర‌గతి వారికి మిగిలిన‌ట్టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కాక ముందు ల‌క్ష రూపాయ‌ల‌కు పైబ‌డి ఉన్న ప్ర‌యివేటు స్కూళ్లు, క‌ళాశాల‌ల ఫీజులు ఆయ‌న సీఎం అయ్యాక రూ.30 వేలు, రూ.40 వేల‌కు త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ఆర్ త‌న హ‌యాంలోనే రూ.30వేల‌కు మించి ఫీజులు ఉండ‌కూడ‌ద‌న్న చ‌ట్టాన్ని తెచ్చారు. ప్ర‌భుత్వం మారాక ట్యూష‌న్ ఫీజు అంటూ ఆ మొత్తానికి ఇంకొంత అమౌంట్ జ‌త చేస్తూ ఫీజును మ‌ళ్లీ అమాంతం పెంచేశారు. అలా అలా ఆ ఫీజు మ‌ళ్లీ ల‌క్ష‌ల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి. ఇప్పుడు ఆ ఫీజు నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం తీర్మానం చేసింది. మరి ఎన్ని రోజుల్లో ఈ ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌కు ద‌క్కుతాయో అన్న‌ది చూడాలి.

 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle