newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.!

09-10-201909-10-2019 09:28:42 IST
2019-10-09T03:58:42.125Z09-10-2019 2019-10-09T03:58:36.655Z - - 06-12-2019

సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రో సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నారు. రిజిస్ట్రేష‌న్‌ల శాఖ‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. అయితే, ఆస్తుల క్ర‌య విక్ర‌యాల విష‌యాలు రిజిస్ట‌ర్ అయితేనే ఆ లావాదేవీల‌కు ప‌రిపూర్ణ‌త ఏర్ప‌డుతుంది. ఈ క్ర‌మంలో స్థ‌లాల‌ రిజిస్ట్రేష‌న్ ధృవ‌పత్రాల‌ను ఎలా రాయించుకోవాలో తెలీక ప్ర‌జ‌లు రైట‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్రియ ప్ర‌జ‌లపై భారీగానే ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఇది గ్ర‌హించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైట‌ర్ల పెత్త‌నానికి క‌త్తెర వేసింది.

స‌బ్ రిజిస్ట్రేష‌న్‌ల కార్యాల‌యాల్లో రైట‌ర్ల ప్ర‌మేయం లేకుండానే స్థిరాస్తి క్రయ‌, విక్ర‌యాలు జ‌రిగేలా జ‌గ‌న్ స‌ర్కార్ స‌రికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం సుల‌భ రిజిస్ట్రేష‌న్ విధానం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్థల క్ర‌య విక్ర‌యాల‌కు సంబంధించి ప్ర‌భుత్వం సూచించిన విధంగా ఆధారాల‌ను న‌మోదు చేసుకుంటేనే టైమ్ స్లాట్ ల‌భిస్తుంది. నిర్దేశించిన స‌మ‌యానికి స‌బ్ రిజిస్ట్రార్ చేరి ఉంటే నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఆన్‌లైన్ విధానంలో ఈ ప్ర‌క్రియ ముగుస్తుంది.

ఈ ప‌ద్ధ‌తి ప్ర‌కారం registration.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్‌చేసి వివ‌రాల‌ను నింపితే చాలు. ప్రతి లావాదేవీకి యూజ‌ర్ ఐడీ క్రియేట్ అవుతుంది. వివ‌రాల‌ను అప్‌లోడ్ చేయ‌గానే అది స‌భ రిజిస్ట్రార్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. అధికారి అన్నీ ప‌రిశీలించి ఓకే చేస్తారు.

మ‌రోవైపు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ద‌ళారీలు, అవినీతితో విసుగుచెందిన ఈ నూత‌న డేటా ఎంట్రీ విధానాన్ని స్వాగ‌తిస్తున్నారు. ప‌ర్సంటేజీల‌ను లెక్క‌క‌ట్టి ముక్కుపిండి మ‌రీ వ‌సూళ్ల‌కు పాల్ప‌డే ప‌ద్ధ‌తికి చెక్‌ప‌డ‌టంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ధృవ‌ప‌త్రాల రైట‌ర్లే రింగ్ మాస్ట‌ర్‌ల‌ని ఇటీవ‌ల ఏసీబీ నిర్వ‌హించిన దాడుల్లో తేట‌తెల్ల‌మైన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ స‌ర్కార్ ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ఈ డేటా ఎంట్రీ విధానంపై మొద‌టి రోజు క‌క్ష‌దారుల‌కు అవ‌గాహనా రాహిత్యంగా అనిపించినా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాల‌ని, డేటా ఎంట్రీపై మ‌రింత ప్ర‌చారం చేస్తే కొత్త విధానం మ‌రింత సుల‌భ‌త‌రంగా ఉంటుంద‌ని సంబంధిత అధికారులు మొత్తానికి రైట‌ర్ల‌కు చెక్‌పెట్టేలా జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న ఈ స‌రికొత్త నిర్ణ‌యం అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle