newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

సీఎం జ‌గ‌న్‌పై కావాల‌నే అలా మాట్లాడారా..? ఆంత‌ర్యం అదేనా..?

12-08-201912-08-2019 19:37:53 IST
Updated On 13-08-2019 12:27:02 ISTUpdated On 13-08-20192019-08-12T14:07:53.334Z12-08-2019 2019-08-12T14:07:48.513Z - 2019-08-13T06:57:02.725Z - 13-08-2019

సీఎం జ‌గ‌న్‌పై కావాల‌నే అలా మాట్లాడారా..? ఆంత‌ర్యం అదేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కేంద్రంగా సినీ ఇండ‌స్ట్రీలో వేడి పెరుగుతోంది. ఇదేంటి.. జ‌గ‌న్ కేంద్రంగా సెగ‌రాజుకోవాల్సింది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌దా..? సినీ ఇండ‌స్ట్రీలో అంటారేంటి..?  

రాజ‌కీయాలు అన్నాక విప‌క్షాల విమ‌ర్శ‌లు.. ఆ త‌రువాత అధికార‌పార్టీ రెస్పాండ్.. అవ‌స‌ర‌మ‌నుకుంటే స్వ‌యాన సీఎం రంగంలోకి దిగుతారు. ఇలా సీఎం కేంద్రంగా రాజ‌కీయాలు హీటెక్క‌డం స‌ర్వ‌సాదార‌ణం. కానీ, విచిత్రంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌గ‌న్ కేంద్రంగా మాట‌కు మాట ఎపిసోడ్ య‌మ జోరుగా సాగుతోంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే.., క‌ళాకారులు ఏమైనా వ్యాపారులా..? ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే క‌ల‌వ‌డానికి, జ‌గ‌న్ ప్ర‌స్తుతం రాష్ట్ర పాల‌న‌లో బిజీగా ఉన్నాడు.., కాస్త కుదురుకున్నాక క‌చ్చితంగా టాలీవుడ్ పెద్ద‌ల‌మంతా వెళ్లి క‌లుస్తాం.. నేను కూడా వీలుచూసుకుని మూడు, నాలుగు రోజుల్లో జ‌గ‌న్‌ను క‌లుస్తా.. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌ర‌న్నారో తెలుసా..? స‌్వ‌యాన మ‌న న‌ట కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్. అయితే  రాజేంద్ర ప్ర‌సాద్ అన్న ఆ వ్యాఖ్య‌ల్లో క‌ళాకారులు ఏమైనా వ్యాపారులా..?  సీఎం అయిన వెంట‌నే జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి అన్న స్టేట్‌మెంట్ ప్ర‌స్తుతం హైలెట్ అయింది. అంతేకాక సోష‌ల్ మీడియాలో సైతం ఏ మాత్రం గ్యాప్ లేకుండా వైర‌ల్ అయింది.

అయితే, జ‌గ‌న్ సీఎం కావ‌డం తెలుగు సినీ పెద్ద‌ల‌కు ఇష్టం లేదంటూ న‌టుడు పృథ్వీ చేసిన వ్యాఖ్య‌లు గ‌తంలో పెద్ద క‌ల‌క‌ల‌మే రేపాయి. పృథ్వీ వ్యాఖ్య‌ల‌కు స్పందించిన పోసాని వాటిని ఖండించారు. పృథ్వీ తొంద‌ర‌ప‌డి స్టేట్‌మెంట్ ఇచ్చార‌ని పోసాని అన్నారు. జ‌గన్ అంటే సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల్లో చాలా మందికి ఇష్ట‌మ‌న్నారు. ఆ త‌రువాత పోసాని వ్యాఖ్య‌ల‌పై పృథ్వీ స్పందించారు. అన్న‌య్య స్థానంలో ఉన్న పోసాని కామెంట్స్‌ను పాజిటివ్‌గానే తీసుకుంటామ‌న్నారు. అంతటితో ఎపిసోడ్ క్లోజ్ అయింద‌ని అంద‌రూ భావిస్తున్న త‌రుణంలో తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్ కూడా సీన్‌లోకి వ‌చ్చేశారు. హాట్‌హాట్ కామెంట్స్‌తో సినీ పొలిటిక‌ల్ ఫైర్‌ను మ‌రింత పెంచారు. సాధార‌ణంగా ఈ త‌ర‌హా టాపిక్స్ ఒక‌టి రెండు స్టేట్‌మెంట్స్‌తో ఆగిపోతాయి. కానీ టాలీవుడ్‌లో మాత్రం జ‌గ‌న్ కేంద్రంగా పంచ్ డైలాగ్స్ ఇంకా పేలుతూనే ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా, గ‌తంలో చంద్ర‌బాబు సీఎం అయిన సంద‌ర్భాల్లో కానీ.. ఇటు తెలంగాణ‌లో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో కానీ ప‌రుగు ప‌రుగున వెళ్లి అభినందించిన టాలీవుడ్ పెద్ద‌లు ప్ర‌స్తుతం ఏపీవైపు చూడ‌టం లేదు. అలాగ‌ని సైలెంట్‌గా ఉన్నారా..? అంటే అదీనూ లేదు. ఒక‌రి త‌రువాత ఒక‌రుగా ఇదే అంశంపై కామెంట్స్ చేస్తూ వేడి రాజేస్తున్నారు. లెటెస్ట్‌గా రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇక ఈ ఇష్యూని టాలీవుడ్ వ‌దిలిపెట్ట‌దా..? అన్న చ‌ర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle