newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

సీఎం జ‌గ‌న్‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్ర‌జ‌ల విన్న‌పం..!

23-12-201923-12-2019 10:27:33 IST
2019-12-23T04:57:33.892Z23-12-2019 2019-12-23T04:57:31.691Z - - 05-08-2020

సీఎం జ‌గ‌న్‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్ర‌జ‌ల విన్న‌పం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచినా అందుకు ముందడుగు ప‌డ‌ని విష‌యం విధిత‌మే. గ‌త ఏడాది మాజీ సీఎం చంద్ర‌బాబు జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని కంబాలిదిన్నెవ‌ద్ద రాయ‌ల‌సీమ స్టీల్ కార్పొరేష‌న్ పేరుతో్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేశారు.

ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు కోసం మూడు వేల ఎక‌రాల‌కు పైగానే ప్ర‌భుత్వ భూమిని సేకరించారు. కానీ, ఈ ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల‌తో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో అది కూడా మ‌రుగున ప‌డింది. బ్రాహ్మ‌ణి స్టీల్ ప్లాంట్ కోసం 2007 జూన్ 10న అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జమ్మ‌ల‌మ‌డుగు మండ‌లం చిటిమిటిచింత‌ల వ‌ద్ద శంకుస్థాప‌న చేశారు. అందుకు 10,670 ఎక‌రాల భూమి కూడా కేటాయించారు.

Image result for Kadapa District Jammalamadugu peoples

విమానాశ్ర‌యానికి మ‌రో నాలుగువేల ఎక‌రాలు సేక‌రించారు. కొంత మేర నిర్మాణ ప‌నులను పూర్తి చేశారు. వైఎస్ఆర్ మ‌ర‌ణానంత‌రం, ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణి స్టీల్ ప్లాంట్ కేసు కోర్టులో న‌డుస్తోంది. జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్రాంతంలోనే రెండు వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసిన ఉక్కు ప‌రిశ్ర‌మ‌లు ముంద‌కు క‌ద‌ల్లేదు.

తాజాగా, సీఎం జ‌గ‌న్ మ‌రోసారి అదే నియోజ‌క‌వ‌ర్గంలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు మండ‌లం సున్న‌పురాళ్ల‌ప‌ల్లి, పెద‌దండ్లూరు గ్రామాల స‌మీపంలో 3,295 ఎక‌రాలు ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేసేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేష‌న్ పేరుతో ఇక్క‌డ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెల‌ప‌డంతో క‌డ‌ప జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. 3,295 ఎక‌రాల్లో 95 శాతం ప్ర‌భుత్వ భూమే ఉంద‌ని, అధికారులు తేల్చారు. స‌మీపంలోనే మైల‌వ‌రం ద‌క్షణ కాల్వ వెళ్తుండ‌టం లాభించే అంశంగా చెబుతున్నారు.

గండికోట జ‌లాశ‌యం నుంచి రెండు టీఎంసీల నీటిని ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు కేటాయిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. అన్ని విధాలా అనువైన ప్రాంతంలో ప‌రిశ్ర‌మ ఏర్పాటు కానుండ‌టం సంతోషంగా ఉంద‌ని స్థానిక‌ల నేత‌లు అంటున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్రాంతంలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ఇప్ప‌టికే ముగ్గురు ముఖ్య‌మంత్రులు శంకుస్థాప‌న చేస్తే అవి నిలిచిపోయాయి. ముచ్చ‌ట‌గా మూడోసారి మూడో సీఎం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు శంకుస్థాప‌న చేయ‌బోతున్నారు. ఇదైనా తొంద‌ర‌గా పూర్తై ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కాల‌ని జ‌మ్మల‌మ‌డుగు ప్ర‌జ‌లు కోరుతున్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle