newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

సీఎం జ‌గ‌న్‌కు జై కొట్టిన త‌మిళ‌నాడు అసెంబ్లీ..!

14-01-202014-01-2020 09:41:10 IST
Updated On 14-01-2020 11:44:12 ISTUpdated On 14-01-20202020-01-14T04:11:10.486Z14-01-2020 2020-01-14T04:11:00.396Z - 2020-01-14T06:14:12.645Z - 14-01-2020

సీఎం జ‌గ‌న్‌కు జై కొట్టిన త‌మిళ‌నాడు అసెంబ్లీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి త‌మిళ‌నాడులో కూడా భారీగా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా త‌మిళ యువ‌త జ‌గ‌న్‌ను నిత్యం అనుస‌రిస్తోంది. భారీగా ఉద్యోగాల భ‌ర్తీ, దిశ యాక్ట్ వంటి కార్య‌క్ర‌మాల‌తో సీఎం జ‌గ‌న్ యూత్‌ను బాగానే ఆక‌ట్టుకుంటున్నారు. త‌మిళ‌నాడు యువ‌త సీఎం జ‌గ‌న్‌ను ఆంధ్రా బాహుబ‌లి అంటూ అభివ‌ర్ణిస్తుంటుంది.

అమ్మ ఒడి ప్రారంభోత్స‌వంలో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చిత్తూరు వ‌చ్చిన‌ప్పుడు త‌మిళ‌నాడు నుంచి భారీగా యువ‌త త‌ర‌లి వ‌చ్చారు. జ‌గ‌న్ మీటింగ్‌లో సెల్ఫీ కోసం పెద్ద బ్యాన‌ర్‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. చెన్నై నుంచి వ‌చ్చాం.. సీఎం జ‌గ‌న్‌తో సెల్ఫీ కావాలంటూ కొంద‌రు యూత్ బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. అటు త‌మిళ‌నాడు అసెంబ్లీ కూడా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపింది.

ఇటీవ‌ల క‌నీ..వినీ.. ఎరుగ‌ని స్థాయిలో చెన్నైలో నీటి కొర‌త ఏర్ప‌డిన‌ప్పుడు ఏపీ సీఎం స్పందించిన తీరుకు తమిళ‌నాడు అసెంబ్లీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. చెన్నైకు నీటి కొర‌త ఏర్ప‌డిన‌ప్పుడు త‌క్ష‌ణం స్పందించి కృష్ణా జ‌లాలను చెన్నైకు విడుద‌ల చేయ‌డంపై తమిళ‌నాడు అసెంబ్లీలో సీఎం ప‌ళ‌నిస్వామి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చెన్నైకు నీటి ఎద్ద‌డి ఏర్ప‌డిన నేప‌థ్యంలో త‌మిళ‌నాడు మంత్రుల బృందం స్వ‌యంగా వెళ్లి ఏపీ సీఎంను క‌లిసింద‌ని, ఏపీ నుంచి నీటిని విడుద‌ల చేయాల్సిందిగా అప్ప‌ట్లో కోరింద‌ని త‌మిళ‌నాడు సీఎం గుర్తు చేశారు.

అందుకు త‌క్ష‌ణం స్పందించిన సీఎం జ‌గ‌న్ మోహన్‌రెడ్డి నీటిని విడుద‌ల చేయ‌డంతో గ్రేట‌ర్ చెన్నై నీటి కష్టాల నుంచి గ‌ట్టెక్కింద‌ని, అంత‌లోనే రుతుప‌వ‌నాలు కూడా రావ‌డంతో ప‌రిస్థితి చ‌క్క‌బ‌డింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చెన్నై ప్ర‌జ‌ల కోసం స‌కాలంలో స్పందించిన ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్టు సీఎం ప‌ళ‌ని స్వామి తెలిపారు. త‌మిళ‌నాడు నీటి క‌ష్టాలు తీరేలా గోదావ‌రి, కావేరి న‌దుల అనుసంధానం ప‌థకం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి వీలైనంత త్వ‌ర‌గా వారి నుంచి అంగీకారం పొందాల‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీకి కూడా లేఖ రాసిన‌ట్టు ప‌ళ‌నిస్వామి చెప్పారు. స్వ‌యంగా ప్ర‌ధానిని క‌లిసిన‌ప్పుడు కూడా ఈ అంశంపై తాను మాట్లాడానని ప‌ళ‌నిస్వామి అసెంబ్లీలో వివ‌రించారు. 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   6 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   6 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   8 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   8 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   9 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   9 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   9 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   10 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   10 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle