newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

సీఎం జగన్ సీడ్ క్యాపిటల్ ఊసే వద్దన్నారా?

15-10-201915-10-2019 08:03:01 IST
Updated On 15-10-2019 11:56:39 ISTUpdated On 15-10-20192019-10-15T02:33:01.314Z15-10-2019 2019-10-15T02:22:16.501Z - 2019-10-15T06:26:39.490Z - 15-10-2019

సీఎం జగన్ సీడ్ క్యాపిటల్ ఊసే వద్దన్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి నెలలు గడిచిపోతున్నా రాజధాని ఆలోచన కనిపించడం లేదు. పలు సంక్షేమ కార్యక్రమాలు, తమ హయంలో చేశామని చెప్పుకొనేలా మార్క్ పడిపోయే గ్రామ సచివాలయ వ్యవస్థ లాంటి కొత్త కార్యక్రమాలను మొదలుపెడుతున్నారే కానీ అమరావతి ఊసేలేదు.

ఇంకా చెప్పాలంటే ఏకంగా రాజధాని మార్పు అంటూ మంత్రులే లీకులిచ్చినా.. రాజధానికి భూములిచ్చిన రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగినా ముఖ్యమంత్రి నోరు మెదపనేలేదు.

రాష్ట్రంలో నిర్మాణ రంగం మూతబడిందని ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టాయో.. రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయని నెత్తి నోరు బాదుకున్నా సర్కార్ మాత్రం ఇప్పుడు అంత అవసరం ఏముందన్నట్లే కిక్కురుమనడం లేదు. బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించారే తప్ప ఆ నిధులతో ఏం చేస్తారన్నది మాత్రం ఎక్కడా ప్రణాళిక లేదు.

గత ప్రభుత్వంలో కట్టిన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక కార్యాలయాలు, తాత్కాలిక హైకోర్టు నుండి ఈ ప్రభుత్వం కార్యకలాపాలు సాగిస్తుందే కానీ గత ప్రభుత్వం మొదలుపెట్టిన శాశ్వత భవనాల నిర్మాణాలలో కదలిక మాత్రం లేదు.

ఇక రాజధాని కోసం ఏర్పాటు చేసిన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సిఆర్డీఏ)కి ఓ ఎమ్మెల్యేను చైర్మన్ ను చేశారే కానీ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారన్నది మాత్రం సమాధానం లేదు.

అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ అధికారులు, చైర్మన్ తో సమావేశం జరిపారని తెలుస్తుంది. ఈ సమావేశంలో చర్చించిన విషయాల మాదిరే సమావేశాన్ని కూడా గోప్యంగానే ఉంచేశారట. అయితే ఈ సమావేశంలో సీఎం రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసింది.

ముఖ్యంగా సీడ్‌ క్యాపిటల్‌ ఏరియా పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టులను ప్రస్తుతానికి మొదలుపెట్టే ఆలోచన మానుకోవాలని ఆదేశించినట్లుగా తెలిసింది. దీంతో పాటు శాశ్వత హైకోర్టు భవనం, రాజ్ భవన్ నిర్మాణాలను కూడా ప్రస్తుతం చేపట్టే ఆలోచన లేదని తేల్చారట. ప్రస్తుతమున్న తాత్కాలిక హైకోర్టు సౌకర్యంగానే ఉందని, రాజ్ భవన్ విజయవాడ భవనం సరిపోతుందన్నారట.

ఇక శాశ్వత సచివాలయం కోసం గత ప్రభుత్వంలో ఇరవై ఐదు అంతస్థులతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన టవర్లలో కూడా మార్పులు చేయాలనీ, తక్కువ అంతస్థులలోనే పూర్తి చేసేవిధంగా ప్లాన్స్ సిద్ధం చేయాలని ఆదేశించారట. ప్రస్తుతం కేటాయించిన నిధులకు సరిపడా మాత్రమే నిర్మాణాలను చేపట్టాలని.. ఆ దిశగానే ప్రణాళికలు సిద్ధం చేయాలనీ సూచించారట.

గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిధిలో దాదాపు రూ.22 వేలకోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టెండర్లు అప్పగించినా అంత మొత్తం చెల్లించేస్తోమత సిఆర్‌డిఏ వద్ద లేదు.

ఈ నేపథ్యంలో ఆ తరహా టెండర్లను పరిశీలించి రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి రాజధానికి అనుసంధానం చేసే జాతీయ రహదారి నిర్మాణాన్ని సైతం కేంద్రం మీద భారం వేయాలని ఆలోచనలో ఉన్నారట.

మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది కనుక ఓ సాదాసీదా రాజధాని చాలన్నట్లే సీఎం సూచించినట్లుగా తెలుస్తుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle