newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

సీఎం జగన్ విన్నవించారా? వివరించి వచ్చారా?

06-10-201906-10-2019 12:46:00 IST
2019-10-06T07:16:00.835Z06-10-2019 2019-10-06T07:15:56.727Z - - 08-12-2019

సీఎం జగన్ విన్నవించారా? వివరించి వచ్చారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకొని ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సుమారు ముప్పావుగంట పాటు సమావేశమై మళ్ళీ అక్కడ నుండి నేరుగా విజయవాడకు వచ్చేశారు. ప్రధాని మోడీ సీఎం జగన్ ను కలిసేందుకు ప్రాధాన్యం ఇచ్చారని.. గంటపాటు జరిగిన ఆ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ లోటును భరించి.. పెండింగ్ సమస్యలతో పాటు కొత్తగా రాజధానికి ఆర్థికసాయం చేయాలనీ ప్రధానిని కోరినట్లుగా ప్రభుత్వ అనుకూల మీడియా కథనాలొచ్చేశాయి. మరీ ముఖ్యంగా కేంద్ర అర్ధభాగం నిధులతో రాష్ట్రంలో మొదలుపెట్టబోతున్న రైతు భరోసా పథకాన్ని ప్రధానితో ప్రారంభించాలన్న తన కోరికను కూడా జగన్ మోడీ వద్ద పెట్టేశారని చెప్పుకొచ్చారు.

కాగా, ఈ సమావేశంలో సీఎం జగన్ రాష్ట్రానికి ఏం కావాలో విన్నపాలు చేయడం కన్నాకూడా ఈ నాలుగు నెలల కాలంలో తాను చేపట్టిన కొన్ని పథకాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారని ప్రభుత్వ తప్పులను ఎత్తుచూపే మీడియా ప్రసారాలు చేసింది. ముఖ్యంగా జగన్ చేపట్టిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ మీద కేంద్ర సీరియస్ గా ఉంది. హెచ్చరికలతో కూడిన సూచనల లేఖలను కూడా రాసింది. కేవలం మీ రాష్ట్రంతో పోదు.. దేశం మొత్తానికి చుట్టుకుంటుందని బహిరంగంగానే ప్రకటించింది. అయినా జగన్ వెనక్కు తగ్గలేదు. దీనిపై నిన్న మోడీకి వివరణ ఇచ్చారని తెలుస్తుంది.

ఇక పోలవరం కాంట్రాక్టుల రద్దు అంశంపై కూడా జగన్ ఈ సమావేశంలో వివరణ ఇచ్చారని, రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్లను ఆదాచేశామని ప్రధానికి వివరణ ఇచ్చి ప్రాజెక్టుపై గత ప్రభుత్వం ఖర్చుపెట్టిన రాష్ట్ర నిధులను త్వరగా విడుదల చేసేలా చూడాలని కోరారట. ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి లేకుండా టెండర్లు పిలవడం, పాత టెండర్లు ఏ కారణంతో రద్దు చేశారు? నిజంగానే రివర్స్ టెండరింగ్ పారదర్శకంగానే జరిగిందా అనే విషయాలపై ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. సో.. దీనిపై కూడా జగన్ ప్రధానికి క్లారిటీ ఇచ్చే ఉండాలి.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జీతభత్యాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి. కనుక కేంద్రం ఆదుకోవాలని సీఎం కోరడం కూడా సహజమైన విషయమే. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎందుకు దిగజారింది అంటే గత ప్రభుత్వ విధానాలే కారణమంటే నమ్మేయడానికి ప్రజలు కాదు కదా.. అక్కడ ఉంది మోడీ సాబ్. అమరావతి నిలిచిపోవడం, పోలవరం నిలిచిపోవడం, ఇసుక కొరత రాష్ట్రంలో నిర్మాణరంగం దివాలా స్థాయికి చేరడం.. రాష్ట్రంలో జరిగే అన్ని అభివృద్ధి పనులు ఆగిపోవడంతో ఆదాయం పడిపోయింది. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఆదాయం లేక సంక్షేమానికే ఖర్చులు పెరిగి చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిపై కూడా ప్రధానికి వివరించి సహాయం కోరారు.

నిజానికి ప్రతిసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో కూడా సమావేశాలుండేది. కానీ నిన్న విమానం దిగి మోడీని కలిసి విమానం ఎక్కి నేరుగా విజయవాడకి వచ్చేశారు. తెలంగాణ సీఎం కెసిఆర్ కైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసి సమ్మె సమస్య ఉంది కనుక హుటాహుటిన రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వద్ద అంత సీరియస్ ఇస్స్యూస్ కూడా ఏమీలేవు. కానీ కనీసం మంత్రులతో కూడా చర్చల్లేకుండానే తిరిగి వచ్చేశారు. మరి ఆ ముప్పావుగంటలో ఇంకేం జరిగింది? ఏపీ రైతుకి మోడీ వచ్చి భరోసా ఇస్తారా? జగన్ వివరణతో కేంద్రం సమాధానపడిందా? లేదా? తేలాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle