newssting
BITING NEWS :
*ఏపీ కేబినెట్ భేటీ. శాసనమండలి రద్దుకి ఆమోదం*భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

సీఎం జగన్.. మామ మోహన్ బాబుని మర్చిపోయారా?

09-11-201909-11-2019 08:41:15 IST
2019-11-09T03:11:15.295Z09-11-2019 2019-11-09T03:10:52.463Z - - 27-01-2020

సీఎం జగన్.. మామ మోహన్ బాబుని మర్చిపోయారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎక్కువగా పొలోమని వైసీపీ కండువాలు కప్పుకొని జగన్ వెంట నడిచారు. ఇందులో కమెడియన్ పృథ్వీ నుండి అలీ వరకు.. మధ్యలో యాంకర్లు వంటి వారి నుండి పద్మశ్రీ మోహన్ బాబు వరకు ఎందరో ఉన్నారు. మూడు రంగుల వైసీపీ జెండా కప్పుకొని మురిసిపోయిన వాళ్లంతా అప్పుడు రాజన్న బిడ్డ మీద మాకు ఏదో నమ్మకం అంటూ అయనతో అడుగులు కలిపి అయన గెలుపు కోసం ప్రచారం కూడా చేశారు.

మొత్తానికి జగన్ కోరినట్లుగా ఆ దేవుడు దయతలచి అధికారాన్ని తెచ్చిపెట్టారు. ఎన్నికలకు ముందు ఏదో ఆశించి పార్టీలో చేరిన వారికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏదోఒక న్యాయం చేస్తూనే ఉన్నారు. కమెడియన్ పృథ్విరాజ్ కు తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకమైన ఎస్వీబీసీకి చైర్మన్ ను చేయగా అలీకి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ పదవికి గత ప్రభుత్వంలో చైర్మన్ గా ఉన్న అంబికా కృష్ణ రాజీనామా చేయగా ఇక ఆ కుర్చీలో అలీని కూర్చోబెట్టడమే ఆలస్యమంటున్నారు.

ఇక నిన్నటికి నిన్న లక్ష్మి పార్వతిని కూడా తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. త్వరలో ఆమెకి క్యాబినెట్ రాంక్ ను కల్పించే యోచనలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాలలో ఓ ప్రచారం కూడా జరుగుతూనే ఉంది. అందరికీ అన్నీ ఇచ్చిన జగన్ గారు వరసకు తనకు మామ, ఇండస్ట్రీ పెద్ద తలకాయలలో తానొకరిని అని భావించే మోహన్ బాబును మాత్రం పట్టించుకోవడం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సీఎం జగన్మోహన్ రెడ్డికి మోహన్ బాబు దగ్గరి చుట్టరికం ఉంది. అయన పెద్ద కుమారుడు విష్ణు సతీమణి స్వయానా జగన్ మోహన్ రెడ్డికి వరసకు చిన్నాన్న కూతురే. వైఎస్ కుటుంబం ఆడపడుచైన విరోనికాను కోడలిగా చేసుకోవడంతో సీఎంకు కూడా మోహన్ బాబు మామ వరస. పైగా టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్ద శత్రువు. అయినా మోహన్ బాబుకి మాత్రం ఇంకా పదవి దక్కనేలేదు. తాను పదవుల కోసం వైసీపీకి రాలేదని.. జగన్ బాబును సీఎంగా చూడాలనే కోరికని అయన చెప్పినా ఆశ ఎవరికి మాత్రం ఉండదు.

ఈమధ్యనే చంద్రబాబు మీద మరోసారి విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన మోహన్ బాబు ఆ పోస్ట్ తాను ఉన్నానని సీఎంకు గుర్తు చేయడం కోసమేనని ఆ మధ్య ప్రచారం జరిగింది. చంద్రబాబు మాట్లాడిన విషయం ఎక్కడా కనిపించకపోయినా మోహన్ బాబు మాత్రం తనను అన్నారని తాను విమర్శలు చేయాల్సి వచ్చింది అంటూ తనదైన స్టైల్ లో రెచ్చిపోయారు. మరి ఇంత తపన పడే మోహన్ బాబుకి సీఎం జగన్ ఎందుకు పదవి ఇవ్వడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

మోహన్ బాబు స్థాయికి తగిన పదవి ఇవ్వాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. పదవి.. సమయం కోసమే సీఎం వేచిఉన్నారని ఆ పార్టీ వర్గాల నేతలు చెప్పుకొస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితమే కేంద్రంలో పెద్దల సభకు వెళ్లిన మోహన్ బాబుకి ఇప్పుడు కనీసం ఆ స్థాయి పదవి అయినా కావాలి కదా అందుకే వెయిటింగ్ అంటున్నారు. గతంలో కొన్ని పదవుల పేర్లు వినిపించినా వాటికి నెలకొన్న పోటీలో మోహన్ బాబు నిలవలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది.. మరి ఇంతకీ పదవి దక్కేది ఎప్పుడు?!

 

 

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   an hour ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   2 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   4 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   4 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   4 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   4 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   8 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   8 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   9 hours ago


టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ప్లాన్‌కు నేష‌న‌ల్ పార్టీల లోక‌ల్ కౌంట‌ర్‌..!

టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ప్లాన్‌కు నేష‌న‌ల్ పార్టీల లోక‌ల్ కౌంట‌ర్‌..!

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle