newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు

06-12-201906-12-2019 12:11:16 IST
Updated On 06-12-2019 17:37:28 ISTUpdated On 06-12-20192019-12-06T06:41:16.947Z06-12-2019 2019-12-06T06:41:14.783Z - 2019-12-06T12:07:28.685Z - 06-12-2019

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రతినిధులే ఢిల్లీలో అభాసుపాలు చేస్తున్నారనిపిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రవ్యవహారాలను అధికారికంగా చూసుకునేందుకు సవరణలు చేసి మరీ విజయసాయిరెడ్డిని నియమించారు సీఎం జగన్. అంతకుముందు ఢిల్లీలో ఏపీ భవన్ లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారిని సీఎం వ్యవహారాలను చూసుకోవడం కోసమని అమరావతికి తీసుకొచ్చుకొని మరీ సీఎంఓలో పెద్ద పీఠవేసి మరీ కూర్చోబెట్టారు.

అయితే ఈ ఇద్దరూ కేంద్రం వద్ద సీఎంను పదే పదే అభాసుపాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి సీఎం జగన్ అమరావతి నుండి ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల వద్ద పడిగాపులు కాచేలా చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా రెండుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరయిందని సీఎం ఢిల్లీ వెళ్లి అయనను కలవకుండానే తిరిగి వచ్చేశారు.

నిన్నటికి నిన్న కూడా అదే సీన్ రిపీట్ అయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం అనంతపురం కియా పరిశ్రమ కార్యక్రమానికి హాజరై అక్కడ నుండి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. రాత్రికి హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఖరయిందని మీడియాకు సమాచారమిచ్చారు. నేషనల్ మీడియాతో సహా తెలుగు మీడియా కూడా రాత్రికి అమిత్ షా ఇంటి వరకు చేరుకున్నారు.

సీఎం జగన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కూడా రాత్రి తొమ్మిది గంటలకు అమిత్ షా ఇంటి వద్దకు వచ్చారు. కానీ అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదు. అర్ధరాత్రి వరకు వేచి చూసినా అపాయింట్ మెంట్ దొరకక మీడియాతో సహా అందరూ వెనుదిరిగారు. నిజానికి అమిత్ షా రాత్రి తొమ్మిది తర్వాత చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం అయితే తప్ప అపాయింట్ మెంట్ ఇవ్వరు. అలాంటపుడు సీఎంను అపాయింట్ మెంట్ దొరకకుండానే ప్రతినిధులు ఢిల్లీకి పిలిపించడం ఎందుకు?.

అమిత్ షా సంగతి అలా ఉంచినా శుక్రవారం ఉదయం ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ జరిగే అవకాశం అని కూడా వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ ప్రధాని మోడీ కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. శుక్రవారం ఏదొక సమయంలో ప్రధానిని కలిసే అవకాశం అని ఈ భేటీపై అధికారిక సమాచారం కూడా ఇచ్చారు. కానీ అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. ఈలోగా నారాయణ అనే తన వ్యక్తిగత సహాయకుడు మరణించడంతో.. ఆయనకు నివాళి అర్పించడానికి జగన్ ఢిల్లీ నుండి కడపకు పయనమయ్యారు.

సీఎం జగన్ కుటుంబానికి నారాయణతో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా నారాయణ సన్నిహితంగా ఉండేవారు. అయన మరణంతో సీఎం ఢిల్లీ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు వెళ్లి నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. అయితే సీఎం ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా అయనను అభాసుపాలు చేయడం అక్కడి ప్రతినిధుల తప్పిదంగానే స్పష్టంగా కనిపిస్తుంది.

 

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   3 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   3 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   4 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   5 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   6 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   7 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   8 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   9 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   10 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle