newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

సీఎం జగన్ తొలి సంతకం ఇదే!

30-05-201930-05-2019 14:50:12 IST
Updated On 25-06-2019 14:56:02 ISTUpdated On 25-06-20192019-05-30T09:20:12.583Z30-05-2019 2019-05-30T09:20:08.937Z - 2019-06-25T09:26:02.537Z - 25-06-2019

సీఎం జగన్ తొలి సంతకం ఇదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలుత ఏ ఫైలుపై సంతకం చేస్తారన్న ఉత్కంఠగా తెరదించారు. తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు జగన్. అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు నేత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ఇతర ప్రముఖులకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. అవ్వ, తాత, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు కోరుతూ ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని వైఎస్సార్‌ పెన్షన్‌ ఫైల్‌పై చేశారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కింద వృద్దుల పెన్షన్‌ను రూ. 2000 నుంచి రూ. 2250కి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇకపై పెన్షన్‌ను ప్రతి ఏటా రూ. 250 పెంచుకుంటూ పోతామని వెల్లడించారు.పాదయాత్రలో, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడ్డారు జగన్.

‘‘వైఎస్‌ జగన్‌ అనే నేను ప్రజల ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్నా.  3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, తొమ్మిదేళ్ల కష్టానికి ప్రతిగా ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతీ అక్కా, చెల్లె, అవ్వా తాత, సోదరుడు, స్నేహితుడు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పదేళ్ల నా రాజకీయ జీవితంలో.. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను. బాధలు విన్నాను. మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నాను.

మీ అందరికీ నేను ఉన్నాను. అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తాం. గత ప్రభుత్వం మాదిరి ప్రతీ కులానికి ఓ పేజీ పెట్టి ప్రతీ కులాన్ని ఎలా మోసం చేసేందుకు తావు లేకుండా రెండే రెండు పేజీల మేనిఫెస్టో తెచ్చాను.  మన సీఎం మన కోసం ఏం చేస్తాడన్న సంగతి ప్రలజందరికి తెలిసి ఉండాలి. దానికి అనుగుణంగా మేనిఫెస్టో తెచ్చి మీ కళ్ల ముందు పెట్టాను.

మీ ఆకాంక్షల మేనిఫెస్టోను ఒక ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతగా.. నా ఊపిరిగా భావిస్తానని సీఎం హోదాలో మాటా ఇస్తున్నాను. నవరత్నాలను అమలు చేస్తాను. అవ్వాతాతల ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం వైఎస్సార్‌ పెన్షన్‌ ఫైల్‌పై చేస్తున్నాను. జూన్‌ నెల నుంచి రూ. 2250 అందిస్తాం. తర్వాత ఏడాది రూ. 2750 ఆ మరుసటి ఏడాది రూ. 3000 వేలు అందిస్తాం’  అని అన్నారు.

గ్రామీణ యువతకు ఉపాధి మార్గం గురించి ప్రస్తావించారు జగన్. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామన్నారు. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. 
ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం.  విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. మొత్తం మీద హర్షధ్వానాల మధ్య వైఎస్ జగన్ తనదైన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle