సీఎం జగన్ జైలుకెళ్లడంలో ఆశ్చర్యమేముంది?-ఉండవల్లి
29-10-201929-10-2019 17:56:08 IST
2019-10-29T12:26:08.208Z29-10-2019 2019-10-29T12:25:54.794Z - - 06-12-2019

గత నెల రోజుల నుండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి అని అనే వార్త అక్కడక్కడా మినుకు మినుకుమంటూ వచ్చింది. కానీ గత వారం నుండి మాత్రం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఇదే ఇప్పుడు బర్నింగ్ ఇస్యూ కాగా ఎవరి నోటా విన్నా ఇదే కథనం వినిపిస్తుంది. నిన్నటికి నిన్న ఓ మీడియా సంస్థల అధినేత తన పలుకులలో విడమర్చి జగన్ జైలు అవకాశాలని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఓ సీనియర్ నేత ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్ అంచనాలతో లెక్కించి మరీ జగన్ జైలుకే అవకాశం అంటూ చెప్పడం సంచలనంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆప్తులైన నేతలలో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒకరు కాగా ఆయనే ఇప్పుడు జగన్ మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశం ఉందని చెప్పడం విశేషం. అందుకు ఆయన కొన్ని పరిస్థితులను కూడా ఉదహరించారు. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అరుణ్ కుమార్ ఈ దేశంలో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోడీ-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అని.. వాళ్ళు తలచుకుంటే ఏదైనా జరిగిపోతుందన్నారు. అంతటి శక్తిమంతులైన చేతులలో అంతే శక్తివంతమైన సిబిఐ అనే వ్యవస్థ ఉందని.. ఇప్పుడు అవి రెండు కలిసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి జైలుకి పంపించే సూచనలే కనిపిస్తున్నాయన్నారు. తాజాగా సిబిఐ కోర్టుకి సమర్పించిన అఫిడవిట్లలో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారని.. అది చూడడానికి చిన్నదే కావచ్చని.. దానికి ఎంతశక్తి కావాలంటే అంతటి శక్తిని ఇవ్వవచ్చన్నారు. ఆ ఒక్క పదంతో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఇప్పటికిప్పుడు రద్దుచేసి జైలుకి తరలించవచ్చన్నారు. సిబిఐ అందులో పేర్కొన్న భాషను చూస్తుంటే ఏమో ఏదైనా జరగొచ్చనే అనుమానాలైతే తప్పకుండా వస్తున్నాయన్నారు. ఇందుకు తమిళనాడులో జరిగిన సంఘటనలు కూడా అరుణ్ కుమార్ పోల్చి చెప్పడం విశేషం. జయలలిత మరణం తర్వాత శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా సుప్రీమ్ కోర్టు కేసుతో ఆమెను అప్పటికప్పుడు జైలుకి తరలించారని... అలాంటిది సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా సిద్ధం చేసిన కేసులో జగన్ ను జైలుకి తరలించడం పెద్ద విషయమేమీ కాదన్నారు. అయితే ఢిల్లీలోని మోడీ-షా ద్వయం ఇప్పటికిప్పుడు ఇంతటి ఉపద్రవాన్ని తెస్తుందా అన్నది తాను చెప్పలేను కానీ సిబిఐ మాత్రం గతంలో దూకుడు ప్రదర్శించిన మాదిరే ఇప్పుడు మరోసారి వేగం పెంచిందన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుందన్నారు. కాగా ఉండవల్లి వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడి మొదలైంది. గ్రామాలలో రచ్చబండ నుండి అమరావతి కార్యాలయాల వరకు ఓ ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. అన్నట్లు ముందుగా జగన్ సిబిఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషనుపై తీర్పు వచ్చేది మరో మూడు రోజులలోనే.. ఆరోజే కొంత స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు!

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
5 minutes ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
20 minutes ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
35 minutes ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
an hour ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
3 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
3 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
18 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్గా అక్బరుద్దీన్ నియామకం
19 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
19 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
20 hours ago
ఇంకా