newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. కుట్రలు చేధించాలని పిలుపు

27-08-201927-08-2019 15:51:25 IST
Updated On 28-08-2019 15:27:17 ISTUpdated On 28-08-20192019-08-27T10:21:25.335Z27-08-2019 2019-08-27T10:21:23.258Z - 2019-08-28T09:57:17.893Z - 28-08-2019

సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. కుట్రలు చేధించాలని పిలుపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్న తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా కొంతమంది కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. 

స్పందన కార్యక్రమంలో భాగంగా నూతన ఇసుకపాలసీపై చర్చిస్తున్న సమయంలో జగన్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే చూడలేక బాధపడేవాళ్లు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. అలాంటి వారి కుట్రలను చేధించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5న నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపారు. 

గతంలో కంటే తక్కువ రేట్లకు ఇసుక దొరుకుతుందన్నారు సీఎం. ఇసుక సప్లై పెంచాలని లేకపోతే రేట్లు తగ్గే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే గుర్తించిన స్టాక్ యార్డుల్లో ఇసుకను నింపడం మెుదలుపెట్టాలని ఆదేశించారు. అవకాశం ఉన్న ప్రతిచోటా రీచ్‌లను ఏర్పాటు చేయాలన సూచించారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు చెప్పడంతో ప్రకృతికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలున్నచోట కొత్త రీచ్ లు తీసుకురావాలన్నారు.

రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని, జీపీఎస్ ట్రాకింగ్ అమలుచేయాలని ఆదేశించారు. ఇసుక సరఫరా అంశంలో ఎవరూ తప్పులు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకుండా చూడాలని జగన్ అధికారులను హెచ్చరించారు.  

ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ తేదీలను సీఎం జగన్ వెల్లడించారు. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 26న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇకపోతే సెప్టెంబర్ చివరి వారంలో సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి నెలకు రూ.10వేలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

దానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉందని అందువల్ల త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అదే ఫిబ్రవరి చివరి వారంలోనే వైయస్సార్‌ పెళ్లికానుక పథకాన్ని కూడా అమలులోకి తీసుకురావబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి వైయస్సార్‌ పెళ్లికానుకను అందిస్తామన్నారు. 

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   5 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   6 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   6 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   7 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   9 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   9 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   10 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   11 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   13 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle