newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

సీఎం జగన్ ఇంటిముందు స్ప‌ృహ తప్పిన మహిళ.. ఎందుకంటే?

01-07-201901-07-2019 12:44:15 IST
Updated On 03-07-2019 12:31:00 ISTUpdated On 03-07-20192019-07-01T07:14:15.041Z01-07-2019 2019-07-01T07:14:12.781Z - 2019-07-03T07:01:00.675Z - 03-07-2019

సీఎం జగన్ ఇంటిముందు స్ప‌ృహ తప్పిన మహిళ.. ఎందుకంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు పాలన తేవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించడానికి, వాటిని సత్వరం పరిష్కరించడానికి అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మొదలు పెట్టాలని తొలుత భావించారు. అయితే ఏర్పాట్లు ఇంకా పూర్తి కాకపోవడం, జూలైలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేశారు. 

అయితే పత్రికల్లో జూలై 1వ తేదీనుంచి ప్రజాదర్భార్ వుంటుందనే ప్రచారం నేపథ్యంలో ప్రజలు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు.దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన విశ్రాంతమ్మ అనే మహిళ స్పృహ తప్పిపడిపోయింది. ముఖ్యమంత్రికి తన సమస్య వివరిద్దామని వచ్చి.. ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది. వెంటనే అధికారులు ఆస్పత్రికి తరలించారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేటి నుంచి నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్‌ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా పడిన సంగతి ప్రజలకు తెలియలేదు. దీంతో వారంతా సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చివరికి విషయం తెలుసుకుని నిరాశతో వెనుతిరిగారు. అధికారులు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సీఎం జగన్‌కి వివరించినట్టు తెలుస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle