newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

సీఎం జగన్‌కు గంటా లేఖ.. అందులో ఏముందంటే?

06-09-201906-09-2019 16:24:56 IST
Updated On 06-09-2019 17:30:35 ISTUpdated On 06-09-20192019-09-06T10:54:56.531Z06-09-2019 2019-09-06T10:54:46.234Z - 2019-09-06T12:00:35.617Z - 06-09-2019

సీఎం జగన్‌కు గంటా లేఖ.. అందులో ఏముందంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ హాట్ టాపిక్ అవుతోంది. ఈ లేఖలో ఏముందనేది ఆసక్తిగా మారింది.

విశాఖ భూ కుంభకోణం పై సిట్ ను పునఃప్రారంభిస్తే స్వాగతిస్తామని, పునఃప్రారంభించాలని లేఖలో కోరారు గంటా శ్రీనివాసరావు. ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో సిట్ ని రీఓపెన్ చేయాలని వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల డిమాండ్ చేయడంపై గంటా స్పందించారు.

గతంలో కూడా భూ కుంభకోణం పై దర్యాప్తు కోరుతూ కేబినెట్ మంత్రి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కి లేఖ రాసినట్టు గుర్తు చేసిన గంటా.. తాజాగా మరో లేఖ రాశారు. సిట్ నివేదిక నూ బహిర్గతం చేయాలని డిమాండ్ చేసినట్టు లేఖలో పేర్కొన్నారు గంటా శ్రీనివాసరావు.

ప్రశాంత నగరంగా ఉన్న విశాఖ ను రాజకీయంగా కలుషితం చేయకుండా చర్యలు తీసుకుంటారని లేఖలో విజ్ఞప్తి చేశారు. సిట్ దర్యాప్తు పునఃప్రారంభించి నిజానిజాలను ప్రజలముందు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ విచారణ తిరిగి ప్రారంభిస్తే పూర్తిగా సహకరిస్తామని, వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు గంటా. ఈ లేఖ ఆగస్టు 29 నే ముఖ్యమంత్రి కి రాశారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది. వందరోజుల పాలన పూర్తిచేసుకోబోతున్న జగన్.. గంటా లేఖకు ఎలాంటి బదులిస్తారో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle