newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

సీఎం జగన్‌కు కాపు నేతల బంపర్ ఆఫర్..

27-10-201927-10-2019 09:23:48 IST
2019-10-27T03:53:48.937Z27-10-2019 2019-10-27T03:53:36.855Z - - 20-11-2019

సీఎం జగన్‌కు కాపు నేతల బంపర్ ఆఫర్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ ఉన్నా కూడా మ‌రో ఏడాది త‌రువాత రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు నిధులు ఉండ‌వ‌ని, ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీ అవ‌డం ఖాయ‌మ‌ని ఆర్థికవేత్త‌లు సూచిస్తున్నారు. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించేందుకు తాము ఎంత ప్ర‌య‌త్నించినా గ‌మ‌నానికి తీసుకోవ‌డం లేద‌ని అధికారులు చెప్పుకొస్తున్న వైనం. ప్ర‌స్తుతం పాల‌న‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని, అందుకు స‌ర‌ఫ‌రా నిధుల కొర‌త ఏర్ప‌డే అవ‌కాశాలు మెండుగ ఉన్నాయ‌ని ఒక సీనియ‌ర్ అధికారి పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌జ‌ల్లో త‌మకు ఆద‌ర‌ణ ఉన్నంత వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌నేమీ చేయ‌లేద‌ని సీఎం జ‌గ‌న్ న‌మ్ముతున్న‌ట్టు తెలుస్తుంది. ఇదే విష‌యాన్ని బీజేపీలోని అగ్రశ్రేణి నాయ‌క‌త్వం గ‌మ‌నిస్తూ వ‌స్తోంది.  రాష్ట్రం ఆర్థికంగా కుదేలై, ప‌థ‌కాల అమ‌లుకు నిధుల కొర‌త ఏర్ప‌డి అవి నిలిచిపోయే వ‌ర‌కు జ‌గ‌న్ జోలికి వెళ్ల‌కూద‌న్న‌ది భార‌తీయ పార్టీ వ్యూహంగా క‌నిపిస్తుంది.

ఈ కార‌ణంగానే రాష్ట్ర ప్ర‌భుత్వ  నిర్ణ‌యాల వ‌ల్ల అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి ఒత్తిళ్లు, విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కేంద్ర ప్ర‌భుత్వం సంయ‌మ‌నంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగించ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న కేంద్ర ప్ర‌భుత్వం జ‌గ‌న్ విష‌యంలో మాత్రం తొంద‌ర‌ప‌డ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

దీంతో, జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను గ్ర‌హించ‌డం వ‌ల్ల‌నే జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద విన‌యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుర‌న్న రాజ‌కీయ కోణంపైనా విశ్లేష‌కుల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగిన వెంట‌నే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా తిప్పుకున్నా ఓపిక‌గా వేచి ఉండి మ‌రీ ఆయ‌న్ను పుట్టిన రోజునాడు క‌లిసి అభినంద‌న‌లు తెల‌ప‌డానికి కార‌ణం కూడా అదేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

మ‌రోప‌క్క‌ అవినీతి కేసుల‌లో విచార‌ణ ఎదుర్కొంటున్న వారు ముఖ్య‌మంత్రి అయితే ప‌రిస్థితి ఇలానే ఉంటుంద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఈ సంద‌ర్భంగా గ‌మ‌నార్హం. అయితే, మున్ముందు త‌న‌కు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్ర‌జ‌ల‌లో అభిమానం మాత్రం చెక్కు చెద‌ర‌కుండా చూసుకోగ‌లిగితే భ‌విష్య‌త్తుకు ఢోకా ఉండ‌ద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ప‌థ‌కాల అమ‌లుతోపాటు సోష‌ల్ ఇంజినీరింగ్ ద్వారా బ‌ల‌మైన ఓటు బ్యాంకును నిర్మించుకోవ‌డానికి వైసీపీ స‌ర్కార్‌ పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే కొన్ని సామాజిక‌వ‌ర్గాలు త‌న‌కు దైర‌మైనా ప‌ర్వాలేద‌ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌తోపాటు రెడ్డి సామాజిక‌వ‌ర్గం అండ‌దండ‌లు త‌న‌కు ఉంటే చాలున‌ని జగ‌న్ మోహ‌న్‌రెడ్డి అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు ఓ ద‌ళిత నాయ‌కుడు చెప్పుకురావ‌డం గ‌మ‌నార్హం. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle