newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

సీఎం జగన్‌కు ఎంపీ వైఎస్ చౌదరి బహిరంగ లేఖ

15-01-202015-01-2020 10:28:47 IST
Updated On 15-01-2020 10:28:44 ISTUpdated On 15-01-20202020-01-15T04:58:47.209Z15-01-2020 2020-01-15T04:50:34.876Z - 2020-01-15T04:58:44.447Z - 15-01-2020

సీఎం జగన్‌కు ఎంపీ వైఎస్ చౌదరి బహిరంగ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజధానుల రగడ కొనసాగుతూనే వుంది. ఏపీ ప్రభుత్వం వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఒక చట్టం కూడా తీసుకురానుంది. మూడుజోన్లుగా విభజించి, చట్టపరమయిన ఇబ్బందులనుంచి బయటపడడానికి ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించనుంది. ఇటు బీజేపీ నేతలు కూడా అమరావతి ఆందోళనలకు తమ మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 

https://www.photojoiner.net/image/aPZUMe4C

బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి వై సుజనా చౌదరి అమరావతిలోనే అన్ని కార్యాలయాలు వుండాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2014లో రాజధానిగా అమరావతిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని,  టిడిపి, వైసిపి, బిజెపి సభ్యులు అమరావతికి మద్దతిచ్చాయన్నారు వైఎస్ చౌదరి.

https://www.photojoiner.net/image/be6WQQhH

https://www.photojoiner.net/image/yKJr1yP0

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమరావతిలో 42 వేల కోట్ల రూపాయల విలువైన  పనులు ఎటువంటి కారణం లేకుండా నిలిపివేశారని, విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటు కోసం భవనాలు వెతుకుతున్నట్టు మంత్రుల ప్రకటనలు చెబుతున్నాయన్నారు.

ఈ పరిణామాలు రాజధాని రైతులలో ఆందోళన, బాధ కలిగిస్తున్నాయన్నారు. రాజధాని తరలింపు ఆర్థికంగా, న్యాయపరంగా ఇబ్బందులకు కారణమవుతుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే విచారణ జరిపించాలని నేను గతంలోనే చెప్పాను.12 శాతం భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, 88 శాతం భూముల్ని నిరుపయోగంగా మారుస్తారా?

https://www.photojoiner.net/image/RijX9KLv

రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని మీరు చేస్తున్న వాదన నిజంకాదు. అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, అన్నీ వున్నాయి. మరో మూడు వేల కోట్లు పెండింగు పనులకు ఖర్చు పెడితే రాజధాని పూర్తవుతుందని లేఖలో పేర్కొన్నారు.

రాజధానిని తరలిస్తే రైతులకు నష్టపరిహారంగా ఒక లక్షా 89 వేల 117 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని, చెట్టును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అమరావతిని కాపాడితే అది రాష్ట్రాన్ని ఆర్థికంగా కాపాడుతుందన్నారు. 

https://www.photojoiner.net/image/IjRqMLlz


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle