newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

సీఎంపై సిబిఐ కనికరం.. హస్తినలోనే కథ నడిచిందా?

26-11-201926-11-2019 12:49:31 IST
Updated On 26-11-2019 14:13:05 ISTUpdated On 26-11-20192019-11-26T07:19:31.185Z26-11-2019 2019-11-26T07:19:26.235Z - 2019-11-26T08:43:05.342Z - 26-11-2019

సీఎంపై సిబిఐ కనికరం.. హస్తినలోనే కథ నడిచిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కోర్టు కాస్త కనికరం చూపించింది. నిన్నటి దాకా సీఎం అయితే మాకేంటి? ముందు మీరు కోర్టుకు రండి మాట్లాడుకుందాం అన్న సిబిఐ ఇప్పుడు కోర్టు మినహాయింపు ఇస్తున్నా పోనీలే అన్నట్లే సైలెంట్ అయింది. సిబిఐ కోర్టు సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చేసింది. మొత్తానికి సీఎంగా కోర్టులో అడుగుపెడతారా అని ఆసక్తికరంగా సాగిన ప్రచారం ముగిసింది.

మరి నిన్నటి వరకు ఎంపీగా ఉండగానే అన్ని చేసిన జగన్ ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇంకెన్ని చేస్తారో.. రామ రామ వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరనే కుదరదని తెగేసి చెప్పింది. కోర్టుకు రావాల్సిందేనని చెప్పి మూడు వారాల నుండి అయన కోర్టుకు రాకపోయినా.. ఇప్పుడు కోర్టు మినహాయింపు ఇచ్చినా సిబిఐ సైలెంట్ అవడానికి కారణమేంటి? అని రాజకీయ వర్గాలలో సహజంగానే చర్చ జరుగుతుంది.

జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టారని, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమాస్తులు సంపాదించారని సిబిఐ మొత్తం 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఇందులో జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పుడు మంత్రులుగా ఉన్నవారిలో కొందరు.. ఐఏఎస్ అధికారులు, మరికొన్ని కంపెనీలు ఉండగా ఎనిమిది సంవత్సరాలుగా కేసు విచారణ సాగుతూనే ఉంది.

ఈ మొత్తం కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న జగన్ పదహారునెలల జైలు జీవితం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య సిబిఐ దూకుడు పెంచిందని, కేసు క్లైమాక్స్ దశకు చేరుకుందని రేపో మాపో ముద్దాయిల పేర్లు ప్రకటన జరిగిపోయి జైలుకే తరలిస్తారని కూడా ప్రచారం జరిగింది. మినహాయింపు ఇవ్వకపోగా జగన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో బెయిల్ రద్దు కూడా చేసే అవకాశం ఉందని విశ్లేషణలు సాగాయి.

ఏమైందో ఏమో కానీ మినహాయింపు దొరికేసింది. దీనికి కారణాలేంటనే విశ్లేషణలు కూడా సహజంగా జరిగేవే. కాగా ఇందుకు సిబిఐ కనికరమా? లేక హస్తినలో కథ నడిచిందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. వైసీపీ పెద్దలు పట్టువదలని విక్రమార్కులలా కేంద్ర పెద్దల వద్ద పెట్టిన పంచాయతీ ఫలించి మరికొన్నాళ్లు ఈ కథలో సస్పెన్స్ కు అవకాశం దక్కేలా చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరోపక్క సిబిఐ పైకి కనికరం చూపించినా కాగితాల మీద కథ బలంగా నడిపిస్తున్నారని.. పంజా విసిరేముందు ఓ అడుగు వెనక్కు వేసే నైజంతోనే సిబిఐ ఇప్పుడు మినహాయింపు ఇచ్చిందని త్వరలోనే పంజా వాడి తగలడం ఖాయమంటున్నారు. ఇంకా సాగదీసే ఉద్దేశ్యంలో లేని సిబిఐ పైకి తలాడిస్తూనే తన పని తాను చేసుకుపోతుందంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఇద్దరి మధ్య నడిచే ఈ దాగుడు మూతల వ్యవహారం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదనే చెప్పాలి.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle