newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

సీఎంగా జగన్ పట్టు కోల్పోతున్నారా? బిగిస్తున్నారా?

07-11-201907-11-2019 07:26:53 IST
2019-11-07T01:56:53.152Z07-11-2019 2019-11-07T01:56:13.317Z - - 06-12-2019

సీఎంగా జగన్ పట్టు కోల్పోతున్నారా? బిగిస్తున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన మొదలుపెట్టి ఆరు నెలలు గడిచింది. పాలనాపరంగా సంక్షేమ పథకాలే పరమావధిగా ముందుకు వెళ్తున్న సీఎం అభివృద్ధి అన్న పదంతో ఇప్పుడు అవసరమేముందిలే అన్న చందంగా పాలిస్తున్నారని ఓ వర్గం బలంగా ఆరోపిస్తుంది. మరో వర్గం పేదవాడి అవసరాలను తీర్చే ప్రభుత్వం ఇదే అంటూ కీర్తిస్తుంది. కాసేపు ప్రజాపాలన అంశాన్ని పక్కనపెడితే ప్రస్తుతం ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్ ఆ ప్రభుత్వం మీద పట్టుకోల్పోతున్నారా? బిగిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

ముందుగా విద్యుత్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల సమీక్ష నుండి మొదలుపెడితే ఆ నిర్ణయాలు ఫలితాలపై అధికారులు ముందే హెచ్చరిచారా? వివరించి చెప్పినా సీఎం మొండిపట్టుగా ముందుకెళ్లారా? పాలన పరంగా కనీసం మంత్రిగా కూడా అనుభవంలేని జగన్ కు అనుభవంకలిగిన అధికారులు చాలా అవసరం. కానీ ఇక్కడ ఆ అధికారులు సీఎంకు జరిగే నష్టాలను.. అనుభవాలను అర్ధమయ్యేలా వివరించడంలో విఫలమయ్యారని చెప్పక తప్పదు.

పీపీఏల మాదిరే ఇసుక విధానంలో కూడా మంత్రులతో సహా అందరూ వాళ్లకు వాళ్లే గందరగోళంలో పడ్డారు. ఇసుక విధానం రద్దుతోనే మొదలైన వివాదంలో మంత్రులు ఎవరికి తోచింది వాళ్లే మీడియా ముందు బయటపడడంతో అసలు ప్రభుత్వ విధానం ఏమిటో కూడా ప్రజలకు స్పష్టత లేకుండా పోయింది. రాజధాని అంశంలో కూడా ఇంచుమించుగా అదే గందరగోళం. ఏకంగా ప్రభుత్వంలో రెండో స్థానంలో కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ లాంటి వంటి మంత్రులు రోజుకో విధంగా రాజధాని మీద అభిప్రాయాలను చెప్పడం ప్రభుత్వానికే స్పష్టత లేదన్న భావన కలుగుతుంది.

ఇక క్యాబినెట్ సమావేశాల విషయానికి వస్తే ఏ శాఖ మీద చర్చ జరిగినా.. ఆరోజు చర్చలో ఎంత పెద్ద విషయమే వచ్చినా.. అన్నిటికి సీఎం మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పే సంఘటనే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ సంబంధిత మంత్రులు రావడం లేదు. సీనియర్లుగా చెప్పుకొనే మంత్రుల శాఖలలోనూ ఇదే తంతు. అయితే మంత్రులు కేవలం ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలు తిప్పి కొట్టేందుకు మాత్రమే మీడియా ముందు కనిపించడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

తాజాగా సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ.. అయనతో నోటీసులు అందుకున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్ తిరిగి ఆయన్నే ప్రాధాన్యతలేని శాఖకు బదిలీ చేయడం వంటి విషయాలను పరిశీలించినా.. ముఖ్యమంత్రి కార్యాలయం.. ముఖ్యమంత్రి వ్యక్తిగత అధికారుల మధ్య కూడా సమన్వయ లోపాలు తీవ్రంగా ఉన్నాయని అర్ధమవుతుంది. సీఎంకు తెలియకుండా అధికారం చెలాయిస్తున్నారంటూ సిఎస్ బదిలీకి ప్రభుత్వం చెప్పిన కారణాలైతే సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం పట్టుసాధించలేకపోతున్నారనే భావన కలిగించేలా ఉన్నాయి.

ఇక పాఠశాల విద్యాశాఖ ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తొలగించి వైఎస్ రాజశేఖరరెడ్డి మార్చడానికి వీలుగా జారీ చేసిన జీవో 78 విషయంలో కూడా ప్రభుత్వం ఇదే తరహా ప్రకటన చేసి మరోసారి అభాసుపాలైంది. పేరుమార్పు వివాదం కావడంతో తనకు తెలియకుండానే జీవో విడుదలైందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. చేయకూడని పనిచేస్తే సీఎం స్థాయి వ్యక్తి ఆగ్రహమే వ్యక్తం చేస్తారన్నది అందరికీ తెలిసిందే.

కానీ తన ప్రభుత్వంలో తనకు తెలియకుండానే జీవోలు విడుదల చిన్నతనమవుతుందని కూడా తెలుకోవాల్సి ఉంది. మీడియాపై తీసుకొచ్చిన జీవో 2430 కూడా క్యాబినెట్లో చర్చ జరిగిన రోజే బయటకు వచ్చింది. అత్యంత గోప్యంగా ఉండాల్సిన జీవోలు బయటకు రావడం.. వివాదాస్పద జీవోలు సీఎంకు తెలియకుండానే విడుదల కావడం తీవ్ర ఆందోళనగా మారింది. అసలు ఏపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అంతుబట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి సీఎం ఇకనైనా ప్రభుత్వ పోకడలను గమనిస్తారా?!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle