newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

సీఆర్డీయే రద్దుపై రహస్య జీవోలు.. ఏఎంఆర్డీఏ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు

02-08-202002-08-2020 13:29:11 IST
Updated On 02-08-2020 13:35:25 ISTUpdated On 02-08-20202020-08-02T07:59:11.730Z02-08-2020 2020-08-02T07:58:51.446Z - 2020-08-02T08:05:25.980Z - 02-08-2020

 సీఆర్డీయే రద్దుపై రహస్య జీవోలు.. ఏఎంఆర్డీఏ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మూడురాజధానుల ఏర్పాటుతో పాటు క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీయే) బిల్లుకూడా పాసయింది. దీంతో సీఆర్డీయే ప్రస్థానం ముగిసింది. ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.  సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా పాలక కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా ఉండనున్నారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.

ఇదిలా వుంటే సీఆర్‌డీఏకి సంబంధించి శనివారం నాలుగు జీవోలు విడుదల చేసిన పురపాలక శాఖ.. వాటిలోని విషయాన్ని రహస్యంగా ఉంచింది. ఆ నాలుగు జీవోలను ‘కాన్ఫిడెన్షియల్‌’గా పేర్కొంది.ఇంతకు ముందున్న ఏపీసీఆర్‌డీఏ పరిధిలోని మొత్తం ప్రాంతాన్ని, ఏఎంఆర్‌డీఏ పరిధిలోకి తెచ్చారా? లేకపోతే ఏమైనా మార్పులు చేశారా? అనేది స్పష్టత లేదంటున్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపడంపై అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. తుళ్లూరులో రైతులు ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తామని.. న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామని, తమకు అక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సమాధానం చెప్పిన తరువాతే రాజధానిని తరలించాలని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జెఏసీ కన్వీనర్, సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ డిమాండ్ చేశారు. విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి  కార్యాలయంలో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు.  విశాఖపట్నంలో కొత్తగా అభివృద్ధి చేయవల్సింది ఏమి లేదని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షములో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చి ఇప్పుడు రాజధానిని చంపుతారా అని వారు ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకురాలు సుంకరపద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలను వైసీపీ ముందు నుండి ద్రోహం చేస్తే వెనుకనుండి బీజేపీ, జనసేన వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు. 

ప్రధాని శంఖుస్థాపన చేసిన అమరావతికే ఈ దుస్థితి వస్తే అయోధ్యలో రామ మందిరానికి శంఖుస్థాపన చేస్తే ఇంకా ఎలా ఉంటుందో అన్నారు. అయోధ్యలో రామమందిరం శంఖుస్థాపనకు వెళ్ళేముందు అమరావతి రాజధానిగా ఉంటుంది అని ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత గద్దె అనూరాధ మాట్లాడుతూ మనకు అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని, అమరావతి 5 కోట్ల ప్రజల కళ అని, ఇందుకోసం 33 వేల ఎకరాలను రైతులు వారి భూములను త్యాగం చేశారన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు ప్రకటించారని ఇప్పుడు అందరం కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు ఈ విధంగా కక్షపురితముగా వ్యవహరించడం సబబేనా అని దేవినేని అపర్ణ అన్నారు. మీరు రాజధాని పెట్టుకోవాలంటే ఒక్కచోట పెట్టుకోండి.. మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను మోసం చేయవద్దు అన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle