newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

సీఆర్డీయేపై జగన్ మరో కీలక నిర్ణయం.. వివాదాలు తప్పవా?

25-12-201925-12-2019 12:36:48 IST
Updated On 26-12-2019 11:37:36 ISTUpdated On 26-12-20192019-12-25T07:06:48.315Z25-12-2019 2019-12-25T07:02:15.450Z - 2019-12-26T06:07:36.777Z - 26-12-2019

సీఆర్డీయేపై జగన్ మరో కీలక నిర్ణయం.. వివాదాలు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరునెలల్లో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  తాజాగా మూడురాజధానుల అంశంపై తీసుకుంటున్న నిర్ణయాలు రచ్చ రేపుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏను రద్దు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం రాజకీయంగా వివాదాస్పదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

రాజధాని పేరుతో రైతులనుంచి 33వేల ఎకరాలకు పైగా సేకరించారు. సీఆర్డీఏ చట్టం కింద టీడీపీ ప్రభుత్వం ఈ భూములను సేకరించిన సంగతి తెలిసింది. ఇప్పుడు రాజదాని మార్పు ప్రతిపాదనపై రైతులంతా ఆందోళనలు చేస్తుండడంతో ప్రభుత్వం ఈచట్టానికి మంగళం పాడాలని భావిస్తోంది. ఈ చట్టంలో ఉన్న అనేక హామీలు రైతులకు భరోసా ఇస్తుండడంతో ఈ చట్టంలోని అంశాల ఆధారంగానే కొందరు రైతులు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సీఆర్డీయే చట్టాన్ని రద్దుచేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలో ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

అసలు ఈ చట్టాన్ని రద్దు చేస్తే ఎలా ఉంటుందనే విషయమై న్యాయనిపుణులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ దిశగా అధికారయంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభమయింది. అయితే, జగన్ భావిస్తున్నట్టు సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం అంత తేలికయిన, న్యాయసమ్మతమయిన విషయం కాదని అంటున్నారు.

ఏకపక్షంగా చట్టం రద్దు చేస్తే.. అది కోర్టుల్లో నిలబడదని అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీపీఏలు, అధికారుల బదిలీలు, పంచాయితీలకు రంగుల విషయంలో కోర్టుల నుంచి మొట్టికాయలు పడుతున్న నేపథ్యంలో సీఆర్డీయేపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాబోయే రోజుల్లో అమరావతి విషయంలో గత సీఎం చంద్రబాబు నాయుడు ఆనవాళ్ళు లేకుండా చేయడానికి జగన్ ముందుకు సాగుతున్నారు. ఒకవేళ సీఆర్డీయే రద్దు చేస్తే మాత్రం రాజకీయంగా వివాదం రాజేసినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle