newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

‘సిట్’ని పని చేయనివ్వండి.. దోషుల్ని వదలొద్దు

20-03-201920-03-2019 12:58:28 IST
2019-03-20T07:28:28.726Z20-03-2019 2019-03-20T07:27:06.967Z - - 26-06-2019

‘సిట్’ని పని చేయనివ్వండి.. దోషుల్ని వదలొద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై ఆయన కుమార్తె సునీత తీవ్రంగా స్పందించారు.  ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మీడియా ప్రచారాలు, కథనాలపై ఒకింత ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరికి తోచినట్లు వారు స్పందించడం కదాని దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయన్నారు సునీతారెడ్డి.  తండ్రి మరణించిన బాధలో తాము ఉండగా... తమపైనే నెగెటివ్ కథనాలు వస్తుండటం బాధ కలిగిస్తోందన్నారు. 

సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వస్తున్న ప్రకటనలపై స్పందించారు. సిట్ దర్యాప్తును ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, నిస్పక్షపాతంగా జరిగేలా చెయ్యాలన్నారు. తన తండ్రిని దారుణంగా చంపిన వారు ఎంతటివారైనా వారికి తగిన శిక్షపడాలన్నారు. ‘‘నాన్నను అత్యంత దారుణంగా హత్య చేశారు. చనిపోయిన ఆయనపై చెడుగా మాట్లాడటం భావ్యం కాదు. ఇలాంటి వాటి ద్వారా సరైన దర్యాప్తు జరిగే పరిస్థితి ఉండదు. ఇవన్నీ దర్యాప్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పనిచేయనివ్వండి. నిజాలు వెలుగుచూడనివ్వండి’’ అని ఆమె కోరారు.

తన సోదరుడు జగన్‌ సీఎం కావాలని వివేకానందరెడ్డి కష్ట పడ్డారు. ఆయన బతికున్నప్పుడు ఎలా గౌరవించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి. ప్రతి కుటుంబంలోనూ అభిప్రాయభేదాలు ఉంటాయి. 700 మంది సభ్యులున్న పెద్ద కుటుంబం. మేమంతా ఒకరినొకరం గౌరవించుకుంటాం. ఇంతమంది ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు ఒకేలా ఎలా ఉంటాయి. తన తండ్రి హత్యపై పారదర్శక విచారణ కావాలని.. అది ఏ సంస్థ అయినా తమకు అభ్యంతరం లేదన్నారు సునీతా రెడ్డి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle