newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

సిక్కోలు ఓట‌రు ఎవ‌రివైపు..-2

21-05-201921-05-2019 07:37:23 IST
Updated On 21-05-2019 07:55:44 ISTUpdated On 21-05-20192019-05-21T02:07:23.504Z21-05-2019 2019-05-21T02:07:12.688Z - 2019-05-21T02:25:44.462Z - 21-05-2019

సిక్కోలు ఓట‌రు ఎవ‌రివైపు..-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

మంత్రి అచ్చెన్నాయుడు మ‌రోసారి పోటీ చేసిన టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి పోటీ ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన పేరాడ తిలక్ ప‌ట్ల సానుభూతి ఉంది. ఆయ‌న క‌ళింగ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత. నియోజ‌క‌వ‌ర్గంలో వారి ఓట్లు 72 వేలు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మంత్రిగా చేసిన అభివృద్ధి నినాదంతో అచ్చెన్న ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. అచ్చెన్న‌కు ఈసారి గెలుపు అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

వైసీపీలో కీల‌క నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుపై గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి గుండా ల‌క్ష్మీదేవి 24 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఆమె నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటార‌నే పేరుంది.

ఈ ఐదేళ్ల‌లో అభివృద్ధి చేశామ‌ని, త‌న‌దే విజ‌యం అని ఆమె ధీమాతో ఉన్నారు. ప‌దేళ్లు మంత్రిగా ప‌నిచేసిన ధ‌ర్మాన‌కు ప్ల‌స్ లు, మైన‌స్ లు స‌మానంగా ఉన్నాయి. అయితే, ఆయ‌న గెలిచి, వైసీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని, నియోజ‌క‌వ‌ర్గం బాగా అభివృద్ధి జ‌రుగుతుంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. మొత్తంగా ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీ రావ‌చ్చు.

న‌ర‌స‌న్న‌పేట‌లో వ‌రుస‌గా మూడుసార్లు గెలిచిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడారు. ఆయ‌న‌పై టీడీపీ అభ్య‌ర్థి బ‌గ్గు ర‌మ‌ణ‌మూర్తి 5 వేల మెజారిటీతో గెలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌ర్మాన బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి కూడా ఉంది. ర‌మ‌ణ‌మూర్తి సైతం ప్ర‌జ‌లు, క్యాడ‌ర్ కు అందుబాటులో ఉంటారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగిన వైసీపీకి విజ‌యావ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ప‌లాస నుంచి ఈసారి ఇద్ద‌రు కొత్త అభ్య‌ర్థుల మ‌ధ్యే పోటీ జ‌రిగింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే గౌతు శ్యాంసుంద‌ర్ శివాజి కూతురు గౌతు శిరీష‌, వైసీపీ నుంచి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు పోటీ చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంది.

సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల్లో వైసీపీకి మొగ్గు క‌నిపిస్తోంది. గౌతు కుటుంబానికి ఇక్క‌డ గ‌ట్టి ప‌ట్టుంది. దీంతో ఇద్ద‌రిలో ఎవ‌రైనా స్వ‌ల్ప మెజారిటీతో గెల‌వ‌వ‌చ్చు.రాష్ట్రంలో చివ‌రి నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఇచ్ఛాపురంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్తి బెందాళం అశోక్ 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు.

ఈసారి ఆయ‌న‌కు పోటీగా మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్ ను వైసీపీ దింపింది. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుంది. జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రిగిన చివ‌రి నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం వైసీపీకి కొంత క‌లిసిరావ‌చ్చు.

అయితే ఆ పార్టీ గెలుపు మాత్రం అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి. మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో ఈసారి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు స‌మానంగా లేదా ఒక సీటు అటుఇటుగా గెలుచుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

సిక్కోలు ఓట‌రు ఎవ‌రివైపు..-1


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle