newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

సిక్కోలు ఓట‌రు ఎవ‌రివైపు..-1

21-05-201921-05-2019 07:33:33 IST
Updated On 21-05-2019 07:57:15 ISTUpdated On 21-05-20192019-05-21T02:03:33.186Z21-05-2019 2019-05-21T02:03:17.082Z - 2019-05-21T02:27:15.359Z - 21-05-2019

సిక్కోలు ఓట‌రు ఎవ‌రివైపు..-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి ఉత్త‌రాంధ్ర ముందునుంచీ అండ‌గా ఉంటోంది. ప్ర‌త్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీకి గ‌ట్టి ప‌ట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ హ‌వా వీచింది. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 7 స్థానాల‌ను టీడీపీ గెలుచుకోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 3 స్థానాల‌కే ప‌రిమితం అయ్యింది.

ఈసారి కూడా శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ సీట్లు ద‌క్కించుకోవాలని టీడీపీ ప్ర‌య‌త్నించ‌గా వైసీపీలో సైతం జిల్లాలో మెజారిటీ స్థానాలు ద‌క్కించుకుంటామ‌న్న ధీమా పెరిగింది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు స్పందన బాగా రావ‌డం, ఎన్నిక‌ల వేళ ప‌లువురు నాయ‌కులు పార్టీలో చేర‌డం, తుఫాన్ల బాధితుల్లో ప్ర‌భుత్వంపై అసంతృప్తి ఉండ‌టం, గ‌త ఐదేళ్ల‌లో జిల్లాలో పెద్ద‌గా అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌ను చూపుతున్న వైసీపీ ఈసారి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుస్తామ‌ని చెబుతోంది. దీంతో రెండు పార్టీల‌కూ జిల్లాపై బాగానే ఆశ‌లు ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ స్వ‌ల్ప మెజారిటీతో గెలుచుకున్న పాల‌కొండ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి మ‌ళ్లీ బ‌రిలో ఉన్నారు. ఆమెకు టీడీపీ అభ్య‌ర్థి నిమ్మ‌క జ‌య‌కృష్ణ గ‌ట్టి పోటీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన సానుభూతి ఆయ‌న‌పై ఉంది. ఇదే స‌మ‌యంలో క‌ళావ‌తికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరుంది. దీంతో ఈసారి కూడా ఇక్క‌డ హోరాహోరీ పోరు జ‌రిగినా వైసీపీకి విజ‌యావ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కంబాల జోగులు కేవ‌లం 512 ఓట్లు స్వ‌ల్ప మెజారిటీతో టీడీపీ అభ్య‌ర్థి ప్ర‌తిభా భార‌తిపై గెలిచారు. ఈసారి టీడీపీ మాజీ మంత్రి కొండ్రు ముర‌ళిని బ‌రిలో నిలిపింది. మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టు ఉండ‌టంతో ఈసారి ఆయ‌నకు స్వ‌ల్ప మెజారిటీతో అయినా గెలిచే అవ‌కాశం ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో పాత‌ప‌ట్నం నుంచి వైసీపీ త‌ర‌పున గెలిచిన క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ టీడీపీలో చేరి ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కు పోటీగా గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా ఓడిన రెడ్డి శాంతిని వైసీపీ బ‌రిలో నిలిపింది. ఇద్ద‌రు అభ్య‌ర్థులూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు. ఇద్ద‌రికీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ మారిన వెంక‌ట‌ర‌మ‌ణ‌పై కొంత వ్య‌తిరేక‌త ఉంది. ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఉన్నా వైసీపీ స్వ‌ల్ప మెజారిటీతో అయినా గ‌ట్టెక్క‌వ‌చ్చు.

https://www.photojoiner.net/image/Y7aQsv5r

ఎచ్చెర్ల నుంచి 2014లో క‌ళావెంక‌ట‌రావు గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఆయ‌న‌పై మ‌రోసారి వైసీపీ నుంచి గొర్లె కిర‌ణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. కిర‌ణ్ పై సానుభూతి ఉన్నా క‌ళావెంక‌ట‌రావు మంత్రిగా నియోజ‌క‌వ‌ర్గాన్ని కొంత అభివృద్ధి చేయ‌గ‌లిగారు. స్థానికేత‌రుడు కావ‌డం ఆయ‌న‌కు కొంత మైన‌స్. అయినా ఆయ‌నకు విజ‌యావకాశాలు క‌నిపిస్తున్నాయి.

ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీకాకుళం జిల్లాలో హాట్ సీట్ గా ఉంది. ఇక్క‌డ ద‌గ్గ‌రి బంధువు త‌మ్మినేని సీతారాం వైసీపీ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్ టీడీపీ నుంచి మ‌రోసారి పోటీ చేస్తున్నారు. ర‌వికుమార్ ఈ ఐదేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు బాగానే అందుబాటులో ఉన్నారు. అయితే వ‌రుస‌గా మూడుసార్లు ఓడిన త‌మ్మినేని సీతారాంపై సానుభూతి క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న స్వ‌ల్ప మెజారిటీతో అయినా విజ‌యం సాధించ‌వ‌చ్చు. (ఇంకా ఉంది)

సిక్కోలు ఓట‌రు ఎవ‌రివైపు..-2


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle