newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

సికోలులో విజయమ్మ మాటల దాడి

01-04-201901-04-2019 08:59:19 IST
Updated On 01-04-2019 09:00:52 ISTUpdated On 01-04-20192019-04-01T03:29:19.122Z01-04-2019 2019-04-01T03:29:12.079Z - 2019-04-01T03:30:52.458Z - 01-04-2019

సికోలులో విజయమ్మ మాటల దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారానికి మరో 9 రోజులే గడువు వుండడంతో అన్నిపార్టీల తమ మాటల దాడిని పెంచాయి. మండుటెండలను సైతం లెక్క చేయకుండా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీంతో తమ అభిమాన నాయకులను చూసేందుకు ప్రజలు వందల, వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబుపై విమర్శలు చేశారు. 600 లకు పైగా హామీలు ఇచ్చి అందరినీ బాబు మోసగించాడన్నారు.

శ్రీకాకుళం జిల్లా పొందూరు, నరసన్నపేట, ఇచ్ఛాపురంలో ప్రచారం చేశారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన 600కు పైగా హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని దగా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో రైతుల్ని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల్ని.. జాబు పేరుతో యువతను నట్టేట ముంచాడని మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మోసపు మాటలతో బయల్దేరాడని నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌ పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకొని.. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లాతో అనుబంధాన్ని ఆమె గుర్తుచేశారు. మా కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. నా భర్త వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, నా కుమార్తె షర్మిల, నా కుమారుడు జగన్‌ ఈ జిల్లాలోనే తమ పాదయాత్రలు ముగించారన్నారు. వైఎస్ ‌హయాంలో శ్రీకాకుళం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు విజయమ్మ. రుణమాఫీ చేస్తామన్నారు. ఒక్క రైతుకైనా రుణమాఫీ జరిగిందా? చంద్రబాబు చేసిన పనికి నేడు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా రాని దుస్థితి ఏర్పడిందన్నారు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌కి పట్టం కట్టాలన్నారు. జగన్ హామీలను చంద్రబాబు కాపీ కొట్టారని విజయమ్మ విమర్శించారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle