newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

సింగిల్ హ్యాండ్‌తో జగన్ సర్వనాశనం చేస్తున్నారా?

14-11-201914-11-2019 12:13:50 IST
Updated On 14-11-2019 15:39:34 ISTUpdated On 14-11-20192019-11-14T06:43:50.821Z14-11-2019 2019-11-14T06:43:47.369Z - 2019-11-14T10:09:34.008Z - 14-11-2019

సింగిల్ హ్యాండ్‌తో జగన్ సర్వనాశనం చేస్తున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి అన్నది ఆమడదూరం జరిగిపోతుంది. సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో అభివృద్ధిని మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో పరిస్థితులే అద్దం పడుతున్నాయి. గత ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతూ అంతర్జాతీయ బ్రాండును సొంతం చేసుకున్న అమరావతిని ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. తాజాగా అక్కడ నుండి సింగపూర్ ప్రభుత్వాన్ని పంపేసింది.

ఏపీ ప్రభుత్వం 2017లో సింగపూర్ ప్రభుత్వంలో స్టార్ట్అప్ ఏరియాను అభివృద్ధిని చేసేందుకు ఒప్పందం చేసుకుంది. మొత్తం 1691 ఎకరాల్లో మూడు దశల్లో ఈ అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం దేశంలోని పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడి దారులను గట్టిగానే ఆకర్షించింది. ఈ ఒప్పందం సమయంలో వీరంతా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు.

ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం దేశంలో పారిశ్రామిక విధానంలో ఓ కొత్త బిజినెస్ మాడ్యూల్ గా మారుతుందని భావించారు. కాగా ఆ ఒప్పందం రద్దు చేసుకోనున్నామని వైసీపీ ప్రభుత్వం రెండు నెలల క్రితమే ప్రకటించి స్టార్ట్అప్ ఏరియా అభివృద్ధిపై ముందుకు వెళ్లకూడదడని సింగపూర్ ప్రభుత్వానికి తెలియజేసింది. తాజాగా సింగపూర్ ప్రభుత్వం అధికారికంగా తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయింది.

తాజా పరిణామాలతో రాజధాని అమరావతిపై వైసీపీ వైఖరి ఏంటన్నది కొంత స్పష్టత వస్తుండగా ఈ ప్రభుత్వం మరోసారి నియమించిన పీటర్ కమిటీ చెప్పేదానిపై అమరావతిలో రాజధాని ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని మంత్రులే చెప్తున్నారు. అయితే తాజాగా పరిస్థితులపై స్పందించిన పారిశ్రామికవేత్తలు సీఎం జగన్ సింగల్ హ్యాండ్ తో ఏపీని నాశనం చేస్తున్నారని అభిప్రాయపడడం ఆందోళన కలిగిస్తుంది.

ఏపీతో సింగపూర్ తెగతెంపులు చేసుకోవడంపై స్పందించిన అక్షయపాత్ర కో ఫౌండర్, ఇన్ఫోసిస్ సహా పలు దిగ్గజ కంపెనీల డైరక్టర్‌ మోహన్ దాస్ పాయ్ ఏపీకి ఇది బాడ్ న్యూస్ గా పేర్కొనగా సీఎం జగన్ ఏపీని నాశనం చేస్తున్నారని ట్వీట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. సీఎం జగన్ నిర్ణయాలతో పెట్టుబడి దారులెవరూ ఏపీ వైపు చూసేందుకు ఇష్టపడడం లేదని పాయ్ తెగేసి చెప్పారు.

నిజానికి రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదు. అధికారం ఉంది కనుక రాజధానిని మార్చేందుకు ఆ అధికారం ఉపయోగపడొచ్చు. కానీ పెట్టుబడి దారులలో ఒకేసారి నమ్మకం కోల్పోయాక తిరిగి వారిని రాబట్టడం అంత సులభం కాదు. ఏపీని మించి వనరులు, అవకాశాలు, రాయతీలు ఇచ్చే ప్రభుత్వాలు దేశంలో చాలాలనే ఉండగా పారిశ్రామిక వేత్తలు పక్కా వ్యాపారకోణంలోనే చూస్తారు. మరి జగన్ సర్కార్ ఏ ఆలోచనతో విపత్కర నిర్ణయాలను తీసుకుంటుందో వాళ్ళకైనా తెలుసోలేదో!

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   9 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   12 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle