newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

సాయిరెడ్డి లేకుండా ఎంపీలు ప్రధానిని కలవద్దు.. సిఎం జగన్

16-11-201916-11-2019 15:15:46 IST
2019-11-16T09:45:46.331Z16-11-2019 2019-11-16T09:45:40.343Z - - 15-12-2019

సాయిరెడ్డి లేకుండా ఎంపీలు ప్రధానిని కలవద్దు.. సిఎం జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వైకాపా ఎంపీలు పార్టీ నాయకత్వాన్ని సంప్రదించకుండానే, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నేరుగా కేంద్రమంత్రులను, ప్రధానిని కలవడం పార్టీ విధానాలకు విరుద్ధమంటూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీని దాటి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే షోకాజ్ నోటీసు జారీ చేయడానికి కూడా వెనకాడను అంటూ జగన్ తన పార్టీ ఎంపీలను తీవ్రంగా హెచ్చరించారు.

ఎంపీలు ఎవరు పడితే వారు నేరుగా కేంద్ర మంత్రులను, ప్రధానిని సైతం కలుస్తుండటం వైకాపా అధినాయకత్వం దృష్టికి వచ్చింది. పైగా ఢిల్లీలో వైకాపా తరపున ఢిల్లీలో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఎంపీలు నేరుగా కేంద్రంతో సంబంధాలు నెరపడం ప్రమాదకరమని వైకాపా అధినేత గ్రహించారు. దీంతో అలాంటివారి ఆశలకు కళ్లెం వేస్తూ ముఖ్యమంత్రి సున్నితంగా హెచ్చరించారు.

పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలను సంప్రదించి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాకే కేంద్రమంత్రులను, ప్రధానిని కలవాలి. అలా కాకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. విజయసాయిరెడ్డి లేకుండా కలవడం సరికాదు. మున్ముందు ఇలా జరిగితే షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకూ వెనుకాడను అని పార్టీ ఎంపీలను జగన్‌ హెచ్చరించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు అందరూ పార్టీ గీసిన గీతలోనే నడవాలి. కానీ కొందరు ఎంపీలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను టీవీ చర్చల్లో నేరుగా చెప్పేస్తున్నారు. ఒకరిద్దరు ఎంపీలు పార్టీని సంప్రదించకుండానే నేరుగా కేంద్ర మంత్రులు, ప్రధానిని కలుస్తున్నారు. ఇది సరికాదు’’ అని పార్టీ ఎంపీలకు వైసీపీ అధినేత, సీఎం జగన్‌ సూచించారు

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిందుకు వీలుగా తాడేపల్లిలోని నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 21 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సంఖ్యాపరంగా వైసీపీ లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీ. ఈ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి’’ అని ఎంపీలకు జగన్‌ సూచించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle