newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

సాగరతీరంలో ఎన్నికల శంఖారావం

02-03-201902-03-2019 08:42:05 IST
2019-03-02T03:12:05.516Z02-03-2019 2019-03-02T03:11:58.271Z - - 22-09-2019

సాగరతీరంలో ఎన్నికల శంఖారావం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ వేదికగా ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం పూరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము చిత్తశుద్ధితో  పనిచేస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. విశాఖలో బీజేపీ ప్రజా చైతన్య సభలో మోడీ ఉద్వేగపూరితంగా  ప్రసంగించారు. తెలుగులో మోడీ  ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు.

Image may contain: 3 people, crowd and outdoor

విశాఖ నగరాన్ని చూసి తన మనసు పులకరిస్తోందన్నారు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, తెన్నేటి లాంటి వ్యక్తులు తిరిగిన భూమి విశాఖ అని అన్నారు. ఏపీ ప్రజల చిరకాల వాంఛ రైల్వోజోన్‌ను సాకారం చేశామని. ఏపీ అభివృద్ధికి దోహదపడే విధంగా రైల్వోజోన్‌ను ఇచ్చామన్నారు. చంద్రబాబునాయుడు తీసుకున్నన్ని యూటర్న్‌లు దేశంలో ఎవరూ తీసుకోలేదని మోడీ ఎద్దేవా చేశారు. 

Image may contain: 7 people, crowd and night

ఏపీ ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ.. స్వలాభం కోసం ఆలోచించేవాళ్లే అధికారంలో ఉన్నారని మోడీ దుయ్యబట్టారు. కొన్ని పార్టీలు సైనికుల మనో స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్‌ను ఏకాకిని చేసి భారత్‌కు అండగా నిలబడితే మహాకూటమి పార్టీలు ఆ దేశానికి అనుకూలంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. 

పనిలో పనిగా మహాకూటమి పార్టీలకు ఎలాంటి భావసారూప్యత లేదని, అలాంటి వారు బలహీనమైన ప్రభుత్వాన్ని మాత్రమే అందించగలరని విమర్శించారు.  రైల్వేజోన్‌ కారణంగా కొత్తలైన్లు, కొత్త రైళ్లకు మార్గం సుగమమై ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ నగరాన్ని ఆకర్షణీయ నగరంగా మార్చడంతో రూ.కోట్లాది రూపాయల ప్రాజెక్టులు విశాఖకు వచ్చాయన్నారు. 

ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకోలేదని చంద్రబాబు ఒట్టేసి చెప్పాలని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాష్ట్రానికి 39 కేంద్ర సంస్థలను కేంద్రం మంజూరు చేసిందని, కేంద్రం ఏమీ చేయలేదని, ఒడిశాకు ఎక్కువ ఆదాయం వెళ్లేలా రైల్వేజోన్‌ను ఏర్పాటుచేశారని చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. సభలో ఎంపీలు హరిబాబు,  గోకరాజు గంగరాజు,  జి.వి.ఎల్‌.నరసింహారావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రధాని మోదీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. మోడీ పర్యటన సందర్భంగా మరోమారు మంత్రులు  ప్రోటోకాల్ పాటించలేదు. స్వాగత కార్యక్రమానికి మంత్రులు హాజరు కాలేదు. తూర్పునౌకాదళ వైస్‌ అడ్మిరల్‌ కరంబీర్‌సింగ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ అదనపు కార్యదర్శి లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ అశోక్‌, సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్‌, విశాఖపట్నం సీపీ మహేష్‌చంద్రలడ్డా, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌లు స్వాగతం పలికారు. మోడీ గో బ్యాక్ అంటూ విశాఖ అంతటా టీడీపీ, కాంగ్రెస్, ప్రజాసంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle