newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

10-12-201910-12-2019 16:26:51 IST
Updated On 10-12-2019 17:29:52 ISTUpdated On 10-12-20192019-12-10T10:56:51.864Z10-12-2019 2019-12-10T10:56:49.825Z - 2019-12-10T11:59:52.294Z - 10-12-2019

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సారి తన మానస పత్రిక సాక్షి రాసింది తప్పేనని నిండు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. అసలు విషయం ఏమిటంటే అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రశ్నోత్తరాల సమయంలో సన్నబియ్యం సరఫరా అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి తామెక్కడా సన్నబియ్యం ఇస్తామని చెప్పనేలేదని తేల్చి చెప్పారు.

తాను ఎన్నికల ప్రచారం కూడా ఎక్కడా సన్నబియ్యం ఇస్తానని చెప్పనేలేదని.. ఇక మ్యానిఫెస్టోలో కూడా కేవలం తినేందుకు అనువైన నాణ్యమైన బియ్యం మాత్రమే ఇస్తామని చెప్పామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టామని, టీడీపీ వాళ్ళు ఇంకా కావాలంటే కళ్ళ జోళ్ళు సర్దుకొని మరీ చూసుకోవాలన్నారు.

అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో బియ్యం పథకం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన స్పీచ్ ను కూడా అసెంబ్లీలో ప్రదర్శించి చూపించారు. దీంతో టీడీపీ సభ్యులు గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నబియ్యం ఇస్తామని చెప్పారని సాక్షి టీవీలో ప్రసారాలను కూడా ప్రదర్శించాలని కేకలు వేశారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ప్రసారం, పత్రికలో వచ్చిన వాటిపై కూడా వివరణ ఇచ్చారు.

టీడీపీ సభ్యుల మాదిరే సాక్షి పత్రిక, ఛానెల్ సిబ్బంది కూడా పొరపడ్డారని.. తాను చెప్పిన నాణ్యమైన బియ్యాన్ని సన్నబియ్యంగా తప్పుగా రాసుకొచ్చారని చెప్పారు. అయితే దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. నాణ్యమైన బియ్యం అంటే గతంలో ఉన్న బియ్యాన్ని కొత్త సంచులలో మార్చడమేగా అంటూ రాష్ట్రంలో కొన్ని చోట్ల సరఫరా చేసిన పాడైపోయిన బియ్యం ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి వైసీపీ సర్కార్ తొలి నాళ్ళలో సన్నబియ్యం పంపిణీ చేయాలనున్నారు. దానిపై సీఎంతో సహా మంత్రులు బహిరంగ సభలలో చెప్పారు. అయితే ఆచరణలో అది కష్టమైంది. దీంతో ఇప్పుడు మంత్రుల నుండి సీఎం వరకు వితండవాదం అందుకున్నారు. ఇందులో సాక్షి కూడా అప్పుడు సీఎం చెప్పిన విషయాన్ని పదేపదే హైలెట్ చేసి సన్నబియ్యం అంటూ ఢంకా భజాయించింది.

కానీ ఇప్పుడు అది జరిగేది కాదని తెలిశాక మంత్రులు సహనం కోల్పోయి బూతులు తిడుతుంటే సీఎం తప్పు మాది కాదు సాక్షిదేనని నెట్టేశారు. అయితే ఇప్పుడు ఇంతకీ భవిష్యత్ తో అయినా సాక్షి చెప్పింది నమ్మాలా వద్దా? ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందా? లేక సాక్షి అబద్దాలను ప్రచారం చేసిందా? సాక్షి అంటే వైసీపీ.. వైసీపీ అంటే ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎవరు నిజం.. ఎవరు అబద్దం?!!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle