newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

20-02-202020-02-2020 11:52:58 IST
2020-02-20T06:22:58.961Z20-02-2020 2020-02-20T06:22:56.238Z - - 27-05-2020

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మీడియాను కట్టడి చేసేందుకు గత ఏడాది జీవో 2430ను తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఏ మీడియా సంస్థకు చెందిన పత్రిక లేదా చానెల్ వాస్తవాలను మాత్రమే ప్రచురించాలి. ఊహాతీతలు, ప్రచారాలు.. ఊహాగానాలను అనుమతి లేకుండా ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వంలోని ఆయా శాఖలకు చెందిన అధికారాలకు అధికారాలు ఉంటాయి.

ఆ జీవోపై ప్రజాసంఘాలు, మీడియా సంస్థలు, మేధావులు ఎందరో గగ్గోలు పెట్టినా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే, అసలు ఇప్పుడు ఆ జీవో ప్రకారం వైసీపీ సొంత మీడియా సంస్థ సాక్షి నడుచుకుంటుందా అన్నది టీడీపీ నేతల ప్రశ్న. ఆ జీవో తెచ్చిన తర్వాత కూడా మాపై విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయడమే సాక్షి నిత్య కృత్యంగా మారిందన్నది టీడీపీ నేతలు, కార్యకర్తల ఆక్రందన.

ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ లోకేష్ చిరుతిండి అంటూ చేసిన కథనంపై పరువు నష్టం దావా వరకు వెళ్లగా ఇప్పుడు ఏకంగా టీడీపీ సాక్షిపై ప్రెస్ కౌన్సిల్ వరకు వెళ్ళింది. సాక్షివి రాతలు కాదు రోతలు అని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రెస్‌కౌన్సిల్‌కు, ఎడిటర్స్ గిల్డ్‌కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏ మాత్రం నిజమన్నది లేకుండా కేవలం బురద జల్లడమే సాక్షి పనిగా మారిందని యనమల ఆ లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యంగా ఫిబ్రవరి 14వ తేదిన సాక్షిలో ప్రచురించిన “మచ్చుకు రెండు వేల కోట్లు, చంద్రబాబు కొండంత అవినీతిపై గోరంత వెలుగు” అనే పేరుతో బ్యానర్ స్టోరీల అంశాలతో పాటు 15వ తేదిన సాక్షి టీవీలోనూ ప్రసారమైన కథనాలను ఆ లేఖలో పేర్కొన్నారు. సాక్షి వేసిన ఈ కథనాలకు ప్రామాణికమైన సీబీడీటీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుతో పాటు అసలు ఎవరి పేర్లు లేవు అయినా సాక్షి ఇష్టారీతిన ప్రసారం చేసింది.

సీబీడీటీ ప్రెస్‌నోట్‌లో కేవలం మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు, ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ అని పేర్కొన్నారు. ఇక ఆ ప్రముఖ వ్యక్తి చంద్రబాబు అనుకున్నా.. మాజీ పిఎస్ శ్రీనివాస్ అనుకున్నా.. అయన ఇంటిపై నిర్వహించిన దాడుల్లో కేవలం రెండు లక్షల 63వేల రూపాయల నగదు, 12తులాల బంగారం మాత్రమే చేసుకున్నట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. మరి ఏ ఆధారం ప్రకారం  ఇష్టం వచ్చినట్లుగా అవినీతి అనకొండను చేశారని యనమల లేఖలో పేర్కొన్నారు.

కేవలం అసత్యాలను ప్రచారం చేసుకొనేందుకు ఓ రాజకీయ పార్టీ స్థాపించిన పత్రిక, చానెల్ ప్రతిపక్షాలపై బురద జల్లడమే పరమావధిగా ప్రసారం చేస్తున్న వీడియోలు, ప్రచురించిన కథనాలను పరిగణలోకి తీసుకొని సదరు పత్రిక ఎడిటర్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రెస్‌కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్ ను యనమల కోరారు. మరి ఆధారాలు లేని సాక్షి కథనాలు, ప్రసారాలపై ప్రెస్‌కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle