newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

సస్పెన్స్‌కు తెర.. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

07-06-201907-06-2019 17:08:53 IST
Updated On 24-06-2019 14:56:13 ISTUpdated On 24-06-20192019-06-07T11:38:53.384Z07-06-2019 2019-06-07T11:38:50.822Z - 2019-06-24T09:26:13.877Z - 24-06-2019

సస్పెన్స్‌కు తెర.. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్ శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఏపీ స్పీకర్ విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఏపీ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎవరు రాబోతున్నారనే సస్పెన్స్‌కు ఇంచుమించు తెరపడింది. స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వైసీపీఎల్పీ సమావేశం తరువాత తమ్మినేని సీతారాం సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 

దీంతో ఆయనను స్పీకర్ పదవికి ఎంపిక చేశారనే వార్తలు మరింతగా బలపడ్డాయి. ఇక ఇదే జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్‌‌కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. జిల్లా నుంచి ఒకరినే కేబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడయిన సీఎం జగన్… తమ్మినేనికి స్పీకర్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ(కళింగ) సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం… గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 

ఏపీ స్పీకర్ పదవి కోసం అనేకమంది పేర్లు తెరమీదకు వచ్చాయి. కోన రఘుపతి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అవన్నీ వాస్తవం కాదని తేలింది. అనంతరం చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరిన తమ్మినేని… ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లోనూ ఓటమి చవిచూసిన తమ్మినేని పట్టుదలగా వ్యవహరించారు.

జగన్ తో కలిసి నడిచిన సీతారాం ఈసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తంగా ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు వైఎస్ జగన్  మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేసేందుకు రెడీగా ఉండాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నారు.

బొత్స సత్యనారాయణ,  పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, సుచరితలకు విజయసాయిరెడ్డి ఫోన్లు చేశారు. రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దంగా ఉండాలని విజయసాయిరెడ్డి సూచించారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై అపారమైన నమ్మకం ఉంచి అప్పగించిన సభాపతి బాధ్యతలను త్రికరణశుధ్ధిగా నిర్వహిస్తానని తమ్మినేని సీతారాం తెలిపారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle