newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

సర్కార్ చేతులెత్తేసిందా... కరోనా రోగుల దుస్థితిపై బాబు ఆవేదన

29-07-202029-07-2020 11:39:14 IST
Updated On 29-07-2020 12:59:02 ISTUpdated On 29-07-20202020-07-29T06:09:14.713Z29-07-2020 2020-07-29T06:08:50.372Z - 2020-07-29T07:29:02.724Z - 29-07-2020

సర్కార్ చేతులెత్తేసిందా... కరోనా రోగుల దుస్థితిపై బాబు ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కరోనా కేసులు భారీగాపెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరిగాక ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జీజీహెచ్‌లో మృతదేహాలు పేరుకుపోయిన పరిస్థితులు బాధాకరమన్నారు. వైరస్ ప్రభావం మృతదేహాలపై ఎంతసేపు ఉంటుందో అధ్యయనం చేసి ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా సోకిన వ్యక్తిని మున్సిపాలిటీ వాహనంలో ఆస్పత్రికి తరలించటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తూ... ధైర్యంగా ఉంటే విపత్తును ఎదుర్కోవచ్చని చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తత తప్పదన్నారు. ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ  ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతోంది. అలాగే కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. కరోనా వల్ల మరణించిన వారి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలన్నారు. 

రోగనిరోధక శక్తి పెంచుకోవడం సహా... మద్యం, ఇతర వ్యసనాలు మానేయాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. హోం క్వారంటైన్, టెలీ మెడిసిన్‌పై మరింత అవగాహన పెంచాలని చంద్రబాబు అన్నారు. మరోవైపు గుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు వ్యక్తి చేరాడు. 

తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక ఈ నెల 16వ తేదీ రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. 12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం అతని భార్య వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా... ఎంత మందిని అడిగినా సమాధానం చెప్పే వారు లేకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. జీజీహెచ్ అధికారులను అడిగినా ఫలితం లేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త ఏమైపోయాడో చెప్పండని జీజీహెచ్ వద్ద భార్య కన్నీరు మున్నీరవుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 1100 దాటిపోయింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కరోనా కేసులు 1,10,297కు చేరుకున్నాయి. ఇందులో 2895 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు.

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   4 minutes ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   44 minutes ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   an hour ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   an hour ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   2 hours ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   15 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   15 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   17 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   18 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle