newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

సర్కారీ భూములపై జగన్ ఫోకస్.. నిధుల కోసమేనా?

08-11-201908-11-2019 12:26:41 IST
Updated On 08-11-2019 12:26:39 ISTUpdated On 08-11-20192019-11-08T06:56:41.972Z08-11-2019 2019-11-08T06:47:25.993Z - 2019-11-08T06:56:39.851Z - 08-11-2019

సర్కారీ భూములపై జగన్ ఫోకస్.. నిధుల కోసమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెస్తుందా..? ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు నిధులకోసం కొత్తదారులను వెతుక్కుంటుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిన్నమొన్నటి వరకు అప్పులు తెచ్చి పథకాలకు అందించిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ప్రభుత్వ భూములపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఏపీలోని ప్రభుత్వ భూములను విక్రయాలు చేయడం ద్వారా ఆ సొమ్మును నవరత్నాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు వినియోగించాలని జగన్‌ సర్కార్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ ఆలోచనపై ఆర్థిక వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూములను వేలం పెడితే రాబోయే కాలంలో మరింత ఇబ్బందులు ఎదురవుతాయని జగన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

ఏపీలోని ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఒక్క గజం ఉన్నా అమ్మేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. నేరుగా ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములే కాకుండా యూనివర్శిటీ పరిధిలోని భూములు విక్రయాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తుంది. గ్రామీణ, మండల, జిల్లా స్థాయిల్లో సచివాలయాలు, విద్య, వైద్యం, ఇతరత్రా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. దీంతో ఆ నిధులను సేకరించేందుకు వీలుగా ప్రభుత్వ శాఖలకు చెందిన సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, గ్రామ, పట్టణ సంస్థలు, తమ పరిధిలోని భూముల విక్రయాలకు సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ సం స్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ప్రచారం సాగుతుంది. ఈ లోపు ప్రభుత్వ భూముల లెక్కలు తీసి వేలం ద్వారా భూముల విక్రయాలు చేసి ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది.

గత ప్రభుత్వాలు ప్రజాఉపయోగ కార్యక్రమాల కోసం ప్రభుత్వ భూములను వినియోగించడం ఆనవాయితీగా వస్తుంది. ఏదైనా సంస్థ కంపెనీ పెట్టి.. దాని ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొస్తే ఆ సంస్థకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తారు. అదీ.. నిబంధనల ప్రకారం.. అంటే ఆ సంస్థ కంపెనీని ఏర్పాటు చేయకపోతే ఆ భూమి మళ్లి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేలా ఒప్పందం చేసుకుంటుంది. అంతే తప్పితే ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీలోనూ ప్రభుత్వాలు ప్రభుత్వ భూములను విక్రయాలు చేసేందుకు సాహసించలేదు.

వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు విక్రయానికి పెట్టారు. హైదరాబాద్‌ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో రియల్‌ భూం భారీగా పెరగడంతో దానిని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఖజానాను పెంచుకొనేందుకు ప్రభుత్వ భూములను విక్రయించారు. ఆ ప్రక్రియ కేవలం హైదరాబాద్‌ చట్టు పక్కల కొన్ని ప్రాంతాల భూములకే పరిమితమైంది. ఇప్పుడు ఆయన తనయుడు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఏపీలోని అన్నిప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీ సీఎం తన మేనిఫెస్టోలోని నవరత్నాలను అమలు చేయడంలో భాగంగానే భూములను అమ్మకానికి పెడుతున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టో ప్రకారం.. ఓక్కో కుటుంబానికి ఏడాదికి రూ.3లక్షల వరకు లబ్ధిచేకూరాలి. అంటే నెలకు రూ.30వేలకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిలో నేరుగా నగదు పంపిణీపథకాలు కూడా ఉన్నాయి. వీటిని అమలు చేయాలంటే లక్షల కోట్లు కావాలి. వివిధ రకాల పేరుతో అనర్హులను ఏరివేసిన 5నుంచి 10వేల కోట్ల భారం తగ్గుతుంది కానీ అంతకు మించి తగ్గే పరిస్థితి లేదు.

ఇప్పటికే ఈ పథకాలకుగాను సీఎం జగన్‌ నాలుగు నెలల్లోనే రూ. 24వేల కోట్లు అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు మొత్తం నగదు పంపిణీ పథకాలకే పెట్టింది. ఈ నగదుతో కొంతకాలం నడిపినా.. ముందుముందు కాలంలో పథకాలను అమలు చేసేందుకు నగదు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఆదాయ వనరు కావాల్సిన అమరావతిని జగన్‌ సర్కార్‌ పక్కకు పెట్టేసింది. ఇప్పుడు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషణలో పడింది. ఆప్రక్రియ ఇప్పట్లో కుదిరేపని కాకపోవటంతో.. తక్షణమే ప్రభుత్వ ఖజానాను పెంచేందుకు జగన్‌ ప్రభుత్వ భూములపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను అమ్మకాలు చేయడం ద్వారా వచ్చే నగదును నవర త్నాలు, ఇతర పథకాలను వినియోగించే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు సమాచారం.

సీఎం జగన్‌ నిర్ణయాన్ని ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మన చేతిలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మితే రాబోయే కాలంలో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఏపీకి సొంత ఆస్తులు లేకుండా పోయే ప్రమాదముందని వాదిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. జగన్మోహన్‌రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేందుకు సంసిద్ధంగా లేరని, ఎలాగైనా ప్రభుత్వ భూములను అమ్మి ఖజానాను నింపాలనే ఉద్దేశంతోనే జగన్‌ ముందుకు సాగుతున్నట్లు పలువురు సీఎం ఫేసీ అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. జగన్‌ నిర్ణయాలతో రాబోయే కాలంలో ఏపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle