newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

25-05-202025-05-2020 16:45:09 IST
Updated On 25-05-2020 18:01:46 ISTUpdated On 25-05-20202020-05-25T11:15:09.411Z25-05-2020 2020-05-25T11:14:45.473Z - 2020-05-25T12:31:46.609Z - 25-05-2020

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏటా ఎండాకాలం వస్తోందంటే చాలు శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో హడావిడి మొదలవుతుంది. ఈ ఏడాది కూడా వర్షాలు ఎక్కువగా పడినా నీటిని దిగువకు విడుదల చేయడంతో బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన శ్రీశైలం డ్యాం వద్ద నెలకొన్న కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా ఇంతవరకు ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తూ తెలుగు రాష్ట్రాలకు విద్యుత్తు కాంతులను అందించేందుకు విద్యుదుత్పత్తిని తయారు చేస్తున్నారు. 

అయితే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 812 అడుగులకు చేరుకోవడంతో కేవలం 35 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది, దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నీలిపివేస్తున్నట్లు  శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రం ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ రాంబాబు తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకూ విద్యుత్ ఉత్పత్తి చేసామని ఇంతవరకూ  ఈ సీజన్లో ఇదే విద్యుత్ ఉత్పత్తి కి ముగింపు అని తెలిపారు శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ఇన్ ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ రాంబాబు.

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 812 అడవులుగా ఉండడం అదే శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35 టీఎంసీల ఉంది. కృష్ణా వాటర్ రివర్ బోర్డు ఆదేశాల మేరకు ఇరు తెలుగు రాష్ట్రాలు నీటి పంపకాలు జరగడంతో ఆంధ్ర కు సంబంధించిన వాటా ముగియడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఇకమీదట శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి జరగదు. అయితే వర్షాలు త్వరగా కురిస్తే కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో అలాగే ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఆశించినంత వర్షాలు కురిస్తే కృష్ణా నది వరద ప్రవాహం తో శ్రీశైలం ఆనకట్ట నిండి మళ్లీ శ్రీశైలం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది అంతవరకూ ఇప్పట్లో జల విద్యుత్ ఉత్పత్తి జరగబోదు. 

 

 

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

   11 hours ago


దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

   12 hours ago


ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

   12 hours ago


ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

   13 hours ago


ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

   13 hours ago


దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   14 hours ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   14 hours ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   15 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   16 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle