newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

సభలో ఉంటేనే స్పీకరా.. తమ్మినేనికి యనమల ఘాటు లేఖ

18-11-201918-11-2019 08:24:26 IST
Updated On 18-11-2019 12:10:30 ISTUpdated On 18-11-20192019-11-18T02:54:26.686Z18-11-2019 2019-11-18T02:53:51.736Z - 2019-11-18T06:40:30.268Z - 18-11-2019

సభలో ఉంటేనే స్పీకరా.. తమ్మినేనికి యనమల ఘాటు లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఒకవైపు ఎమ్మెల్యే వంశీ, మంత్రి కొడాలి నాని-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటు ఏపీ మాజీ స్పీకర్, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, స్పీకర్ తమ్మినేని సీతారాం మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఏపీ మాజీ మంత్రి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ రాశారు. స్పీకర్ స్థానంలో ఉంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరం అని పేర్కొన్నారు. 

ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎవరూ చేయలేదన్నారు. స్పీకర్‌గా విశిష్టమైన స్థానంలో ఉంటూ ఆ విశిష్టతను దెబ్బ తీసేలా తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని సీతారాం కు రాసిన లేఖలో యనమల వివరించారు.

శాసనసభ లోపల ఉంటేనే స్పీకర్.. బయటకు వస్తే స్పీకర్‌ను కాదనే ధోరణి సరైంది కాదన్నారు. ఒక వ్యక్తిమీద నిరాధార ఆరోపణలు చేయడం స్పీకర్ స్థానంలో ఉన్నవారికి ఎంతమాత్రం తగదని, గతంలో స్పీకర్లు ఎలా వ్యవహరించారో తెలుసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం స్పీకర్ స్థానానికే కళంకం అన్నారు.

తమ్మినేని ఏమన్నారంటే....

అగ్రిగోల్డ్ విషయంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆరోపించారు.

తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు రూ.10 వేలు ఇస్తానని చెప్పి అందరి దగ్గర పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలే స్కాంలకు పాల్పడితే ప్రజలేమైపోవాలని తమ్మినేని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అన్యాయం జరిగితే స్పీకర్ స్పందించకూడదా అని ప్రశ్నించారు.  తాను ముందు ఎమ్మెల్యేనని, తర్వాతే స్పీకర్‌నని చెప్పారు.

తమ్మినేనిపై టీడీపీ నేతల వ్యాఖ్యలు 

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, కైలే అనిల్‌కుమార్ అసెంబ్లీ కార్యదర్శికి  ఫిర్యాదు చేశారు. బీసీ స్పీకర్‌ను దారుణంగా కించపరిచేలా టీడీపీ వెబ్‌సైట్‌ ఈ-పేపర్‌లో ఇష్టానుసారంగా రాశారని వైసీపీ నేతలు మండిపడ్డారు.

నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, కూన రవిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈమధ్య మాజీ మంత్రి నారా లోకేష్ స్పీకర్ తమ్మినేనికి లేఖ రాశారు.  బడుగు బలహీన వర్గాలకు చెందిన తమరు మీ అనుభవం తో స్పీకర్ పదవికి వన్నె తెస్తారని అందరు అనుకున్నారని... విలువలతో సభ నిర్వహించి ట్రెండ్ సెట్ చేస్తాను అన్న మీరు... అసభ్య పదజాలంతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారంటూ లోకేష్ విమర్శించారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పీకర్ తమ్మినేని సీతారాం పై పలు విమర్శలు గుప్పించారు. ఒక స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. స్పీకర్‌కు దమ్ముంటే అగ్రిగోల్డ్ వ్యవహరం పై సభలో చర్చపెట్టాలని టీడీపీ నేత కూన రవికుమార్ డిమాండ్ చేశారు. స్పీకర్ స్థాయిని దిగజార్చి మాట్లాడవద్దని పలువురు నేతలు హితవు పలికారు. ఈనేపథ్యంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విరుచుకుపడ్డారు. స్పీకర్‌కు రాజకీయాలు చేయాలనే కోరిక ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలన్నారు.

మొత్తం మీద ఇటు మాజీ స్పీకర్-తాాజా స్పీకర్ ల మధ్య వ్యాఖ్యలతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle