newssting
BITING NEWS :
* నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు .. అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు *మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఏపీ సర్కార్ ఆదేశం *నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ * వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌ ..పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు *ఇవాళ్టితో 65వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళన.. ఫాలో అప్‌*జనసేన అధినేత పవన్ ఇవాళ ఢిల్లీ పర్యటన.. సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ *ఇవాళ వేములవాడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన *భారతీయుడు -2 సినిమా షూటింగ్‌లో అపశృతి .. క్రేన్ కూలి ముగ్గురి మృతి * మహారాష్ట్రలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..లారీ-కారు ఢీ. ఆరుగురి మృతి

సంఖ్య' నాకిపోయిన సర్వేలు... సద్బుద్దీ ప్రాప్తిరస్తు ..!

02-04-201902-04-2019 08:17:53 IST
Updated On 02-04-2019 08:17:43 ISTUpdated On 02-04-20192019-04-02T02:47:53.860Z02-04-2019 2019-04-02T02:46:46.670Z - 2019-04-02T02:47:43.288Z - 02-04-2019

సంఖ్య' నాకిపోయిన సర్వేలు... సద్బుద్దీ ప్రాప్తిరస్తు  ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్ని రోజులుగా సర్వేల పేరుతో టీవీ చానెళ్లు, పత్రికలూ కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని చేస్తున్న   సర్వేలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇటువంటి సర్వే ఫలితాలు  ప్రతీ ఎన్నికలకు ముందూ బయటపెడుతూ ఉంటారు. కానీ నిజాలు మాత్రం వేరేగా ఉంటున్నాయి. .. తాజాగా సోమవారంనాడు ఒక ప్రముఖ దినపత్రిక లోక్ నీతి- సీఎస్డీఎస్ (csds)  పేరుతో ఒక వార్త ప్రచురించింది. ఇక ఈ సర్వేలో తెలుగుదేశానికి  135 నుంచి 140 సీట్లు వస్తాయనీ, 18 నుంచి 22 లోక్ సభ సీట్లు దక్కించుకుంటుందంటూ ప్రచురించిన వార్త సంచలనమయింది.  

నిజానికి సీఎస్డీఎస్ పరిశోధనా రంగంలో పేరు ప్రఖ్యాతులున్న సంస్థ. ఆ సంస్థ గురించి తెలిసిన కొంతమంది వ్యక్తులు దాని నిర్వాహకుల్ని సంప్రదించారు. "తాము ఏపీలో ఎటువంటి సర్వే చేయలేదని.. పైగా కేవలం ఓ రాష్ట్రంలోనే అంత పెద్ద శాంప్లింగ్ చేపట్టమని సంస్థకు చెందిన డా. హిలాల్ స్పష్టంగా చెప్పారు. అసలు తాము ఏ సర్వే  చేపట్టినా వాటి ఫలితాల్ని ముందుగా తమ వెబ్ సైట్లో ప్రచురించిన తరువాతే బయటకు విడుదల చేస్తామని ’’ ఆయన చెప్పారు. ఆ సంస్థ ఈ మేరకు సోమవారం నాడు ఒక  పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. దీనితో బండారం బయటపడింది. చివరకు ఆ పత్రిక తన వార్తను తానే ఖండించుకుంటూ రెజోయిన్డర్ ఇవ్వాల్సి వచ్చింది. 

ఎన్నికల కోసం సర్వే సంస్థలు  క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిశోధన చేయకుండానే ఫలితాల్ని తమకు సొమ్ములిచ్చిన రాజకీయ పార్టీలకు అనుగుణంగా మార్చి ఇవ్వడం చాలాకాలంగా తెలిసిన విషయమే ! అయితే ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి శృతిమించింది. బోగస్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఏదో ఒక మీడియా సంస్థతో టైఅప్ చేసుకుని సర్వే ఫలితాలంటూ ఊదరగొట్టడం అలవాటుగా మారింది.

ప్రజల నాడిని శాస్త్రీయంగా చేసే క్షేత్రస్థాయి పరిశోధనలతో చెప్పవచ్చు తప్ప ఏ మాత్రం అవగాహనలేని వ్యక్తులు స్వలాభాల కోసం చేసే పనులతో అసలు ప్రజాభిప్రాయమే మసకబారిపోతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రకటించే ప్రీ-పోల్ సర్వేలతో కనీసం అరడజను సంస్థలు ఇప్పటికే ఫలితాల్ని ప్రచురించాయి. ఇందులో ప్రముఖ మీడియా సంస్థల సహకారంతో నడచిన సంస్థలు కూడా ఉన్నాయి. 

ఈసారి ప్రకటించిన ఫలితాల్లో ఎక్కువమంది వైస్సార్సీపీకే అధికారం దక్కుతుందంటూ జోస్యాలు చెప్పాయి. వీటిల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఇందులో కొన్నిసంస్థలు తమ శాంప్లింగ్ శాతాన్ని వెల్లడించలేదు. క్షేత్ర స్థాయిలో చేసిన పరిశోధనా వివరాలని కూడా వెల్లడించలేదు. ఇది అసలు పరిశోధనా సూత్రాలకు విరుద్ధం. సంస్థలు తమ డేటా వివరాల్ని బహిర్గతపర్చకపోగా కేవలం ఫలితాల్ని మాత్రం ప్రకటించడం అశాస్త్రీయమే కాదు గర్హనీయం కూడా అంటారు ప్రముఖ సర్వే నిపుణులు డా. పరకాల ప్రభాకర్. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న రైట్ ఫోలియో సంస్థ కేవలం ఎన్నికల నేసథ్యంలో నిర్వహించే సర్వేలకు మాత్రమే పరిమితం  కాకుండా అనేక  అభిప్రాయసేకరణా కార్యకలాపాల్ని చేపడుతోంది. 

కొత్తగా సర్వేల పేరుతో మార్కెట్లోకి వచ్చిన అనేక సంస్థలు తమ అనుభవరాహిత్యంతోనూ, స్వలాభాపేక్షతోనో చేసే పనులు నిజమైన పరిశోధనా సంస్థల పనితీరుతెన్నుల్ని మసకబార్చడమే  కాకుండా ప్రజాభిప్రాయసేకరణ అనే అంశాలకు విశ్వసనీయత లేకుండా చేస్తున్నాయి.

-సతీష్ బాబు 

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

   36 minutes ago


ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

   2 hours ago


ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

   2 hours ago


సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

   3 hours ago


టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

   3 hours ago


ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

   5 hours ago


కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

   5 hours ago


కమల్ నాథ్ వర్సెస్ సింధియా.. అధికారంలోకి వచ్చినా తప్పని వర్గపోరు

కమల్ నాథ్ వర్సెస్ సింధియా.. అధికారంలోకి వచ్చినా తప్పని వర్గపోరు

   5 hours ago


కడియం వర్సెస్ రాజయ్య... గులాబీ నేతల ఆధిపత్యపోరు

కడియం వర్సెస్ రాజయ్య... గులాబీ నేతల ఆధిపత్యపోరు

   6 hours ago


ద్రాక్షారామంలో తోటపై చెప్పుతో దాడి. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ద్రాక్షారామంలో తోటపై చెప్పుతో దాడి. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

   6 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle