newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

సంక్రాంతి త‌రువాత.. సీఎం జ‌గ‌న్ ముందున్న భారీ స‌వాళ్లు ఇవే..!

15-01-202015-01-2020 11:55:41 IST
2020-01-15T06:25:41.325Z15-01-2020 2020-01-15T05:27:07.507Z - - 17-01-2020

సంక్రాంతి త‌రువాత.. సీఎం జ‌గ‌న్ ముందున్న భారీ స‌వాళ్లు ఇవే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేసే విష‌యంలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేసే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఈ అంశంలో కోర్టులు కానీ, కేంద్ర ప్ర‌భుత్వం కానీ చేసేది కూడా పెద్ద‌గా లేదు కాబ‌ట్టి అడుగులు ముందుకే ప‌డ‌వ‌చ్చు. కానీ, విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిని చేయ‌డం టీడీపీ నాయ‌క‌త్వానికి, మీడియా అధినేత‌ల‌కు ఏ మాత్రం మింగుడుప‌డ‌ని అంశ‌మ‌ని ఇప్ప‌టికే తేట‌తెల్ల‌మైంది. విశాఖను రాజ‌ధాని చేయ‌వ‌ద్దంటూ విశాఖ‌వాసులే భ‌యంతో వ‌ణికిపోతున్నారంటూ సొంత క‌థ‌నాలు రాసేంత‌గా, ప్ర‌చారం చేసేంత‌గా టీడీపీ, దాని అనుబంధ మీడియా సిద్ధ‌ప‌డ్డాయి.

విశాఖ‌ను రాజ‌ధానిని చేస్తే అక్క‌డ‌కు గూండాలు వ‌స్తార‌ని, రౌడీలు వ‌స్తార‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆ రెండు ప‌త్రిక‌లు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా రాస్తున్నాయి. అలాంట‌ప్పుడు రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటే ఆ రౌడీలు, గూండాలు అక్క‌డ‌కు రారా అన్న‌దానికి మాత్రం వారు స‌మాధానం చెప్ప‌రు. ప్ర‌జ‌లే అర్ధం చేసుకోవాలి. అమ‌రావ‌తిలో తామంతా ధైర్య‌వంతుల‌ము కాబ‌ట్టి రాజ‌ధాని వ‌ల్ల వ‌చ్చే ప‌రిణామాలు ఎదుర్కోగ‌లం, ఉత్త‌రాంధ్ర‌వారు అమాయ‌కులు కాబ‌ట్టి రాజ‌ధాని వ‌స్తే చెడిపోతారంటూ ఒక ఆధిప‌త్య భావ‌జాలాన్ని క‌లాల ద్వారా ఒల‌క‌పోస్తున్నారు. విశాఖ దూర‌మ‌వుతుందంటూ క‌థ‌నాలు రాస్తున్నారు.

ఎన్ని క‌థ‌నాలు రాసినా మూడు ప్రాంతాల అభివృద్ధి, ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు ముఖ్య‌మంత్రి సిద్ధ‌ప‌డ్డార‌న్న‌ది ఆయ‌న‌లోని తొల‌క‌నిత‌నంతోనే అర్ధ‌మ‌వుతుంది. క‌నుక రోజులు అటూ.. ఇటూ కావొచ్చుకానీ విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధాని కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామం అమ‌రావ‌తిలో అపార భూ సంప‌ద ఉన్న టీడీపీ పెద్ద‌ల‌కు, మీడియా పెద్ద‌ల‌కు జ‌గ‌న్‌పైన ప‌గ‌ను శాశ్వ‌తం చేయ‌వ‌చ్చు. గ‌తంతో పోలిస్తే జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి అద‌నంగా వ‌చ్చింది ప్ర‌స్తుతం ఒక్క అధికారం మాత్ర‌మే. మిగిలిన అన్ని విష‌యాల్లోనూ ఇప్ప‌టికీ టీడీపీదే ఆధిప‌త్యం న‌డుస్తోంది. మీడియా మొత్తం అటువైపే ఉంది. వైసీపీ మీడియా ప్రాబ‌వం కోల్పోతోంది.

ఎన్నిక‌ల ముందు ఉన్నంత ఉత్సాహం చివ‌ర‌కు ఆ పార్టీ సోష‌ల్ మీడియాలోనూ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఆరు నెల‌ల కాలంలోనే ఆరేడు వైసీపీ అనుకూల వెబ్‌సైట్‌లు కూడా దుకాణం స‌ర్దేశాయి. మ‌రికొన్ని అదే దారిలో ప‌య‌నిస్తున్నాయి. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. క‌నుక జ‌గ‌న్‌కు అద‌నంగా చేరిన ఆయుధం ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మాత్ర‌మే. అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ ప‌ట్టున్న టీడీపీ జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను విఫ‌ల ఆలోచ‌న‌లుగా చిత్రీక‌రించేందుకు ఇక ముందు కూడా ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాయి. ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ విష‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆలోచ‌న త‌ప్పు అని, తాము ఊహించి రాసిన క‌థ‌నాలే నిజ‌మ‌ని నమ్మించేందుకు మీడియా నిత్యం ప్ర‌య‌త్నిస్తోంది.

రాజ‌ధాని అయితే రౌడీలు, రాయ‌ల‌సీమ గూండాలు వ‌స్తారంటూ క‌థ‌నాలు రాసిన ప‌త్రిక‌లు ఆ వాద‌నను నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తాయి. విశాఖ‌లో ఏ చిన్న‌నేరం జ‌రిగినా అది రాజ‌ధాని రాక‌తో వ‌చ్చిన ప్ర‌భావ‌మేన‌ని న‌మ్మించేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. న‌గ‌రం అన్నాక నేరాలు జ‌ర‌గ‌డం స‌హజ‌మే. కానీ, విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా చేసిన త‌రువాత ఇప్పుడున్న స్థాయిలోనే నేరాలు జ‌రిగినా వాటిని మాత్రం భూత‌ద్దంలోపెట్టి చూపించ‌డం ఖాయం.

విశాఖ‌లో ఇత‌ర ప్రాంతాల వారు వెళ్లి వ్యాపారం చేసినా అది విశాఖ‌లో వ‌న‌రుల దోపిడీగానే చిత్రీక‌రిస్తార‌న‌డంలో ఎలాంటి అనుమానం లేదు. వీటిని ప్ర‌జ‌లు గుడ్డిగా న‌మ్మేస్తారా..?  లేక ప‌రిస్థితిని బేరీజు వేసుకుంటారా..? అన్న‌ది మీడియాకు అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే మీడియాకు జ‌గ‌న్‌పై ఒక విప‌రీత‌మైన ఫ్ర‌స్టేష‌న్ ఉంది. పాతిక మంది ఎమ్మెల్యేలు లేని వైశ్రాయ్ హోట‌ల్‌కు త‌మ క‌థ‌నాల‌తోనే 150 మంది ఎమ్మెల్యేల‌ను మైండ్ గేమ్‌తో మ‌ళ్లించిన తాము, సారాయి ఉద్య‌మాన్ని లేపి సొంత ప్ర‌యోజ‌నాల కోసం తిరిగి దాన్ని ప‌డుకోబెట్టి తెలుగు ప్ర‌జ‌ల చేత జై మ‌ద్యం సీసా అనిపించిన తాము ఇప్పుడు ఇంగ్లీషు వ‌ద్ద‌.. తెలుగు ముద్దు అంటున్న ఈ జ‌గ‌న్ పాల‌న‌లో ఎవ‌రూ త‌మ‌ను లెక్క‌చేయ‌డంలేదే, బాబే ముద్దు జ‌గ‌న్ వ‌ద్దు అని చెప్పినా విన‌కుండా సొంత బుర్ర‌లు వాడి 151 మంది ఎమ్మెల్యేల‌తో వైసీపీని గెలిపించారే అని ప్ర‌జ‌ల‌పై ఇప్ప‌టికే మీడియా పెద్ద‌ల‌కు కోపం ఉంది. 

ప్ర‌జ‌ల్లో త‌మ‌పై భ‌య‌భ‌క్తులు త‌గ్గిపోవ‌డానికి కార‌ణం జ‌గ‌నే అన్న ఆగ్రహం కూడా మీడియా పెద్ద‌ల్లో ఉంది. క‌నుక విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేసిన త‌రువాత దాని బ్రాండ్‌పై భారీగానే ప్ర‌తికూల క‌థ‌నాల దాడి జ‌ర‌గ‌వ‌చ్చు. 2024లో ఒక‌వేళ తిరిగి అధికారంలోకి వ‌స్తే తిరిగి అమ‌రావ‌తి వేదిక‌గానే రాజ్యం న‌డిపేందుకు ప్ర‌య‌త్నాల‌ను ఇప్ప‌టి నుంచే చేయ‌వ‌చ్చు. అందులో భాగంగానే విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధాని ఒక విఫ‌ల ప్రయోగంగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌వ‌చ్చు.

క‌నుక విశాఖ‌లో శాంతి భ‌ద్ర‌తల విష‌యంలో గానీ, ఉత్త‌రాంధ్రప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టంతోకానీ, అదే స‌మ‌యంలో ఇటు ఉన్న రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌ల్లో లోటు భావ‌న క‌ల‌గ‌కుండా స‌మ‌తుల్య‌త పాటించాల్సిన అవ‌సరం జ‌గ‌న్‌పై త‌ప్ప‌కుండా ఉంటుంది. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేసిన త‌రువాత అక్క‌డ ప‌రిస్థితులు మ‌రింత మెరుగుప‌డ్డాయి.. ముఖ్యంగా శాంతి భ‌ద్ర‌త‌లు మ‌రింత సౌల‌భ్యంగా ఉన్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌ల్లో ధైర్యం నింప‌గ‌లిగిన‌ప్పుడే ముఖ్య‌మంత్రిగా సీఎం జ‌గ‌న్ విజ‌య‌వంత‌మైన‌ట్టు భావించ‌వ‌చ్చు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle