newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

సంక్రాంతి ట్విస్ట్... జగన్ పక్కా ప్లాన్

29-12-201829-12-2018 12:36:07 IST
2018-12-29T07:06:07.333Z29-12-2018 2018-12-29T07:06:04.938Z - - 18-07-2019

సంక్రాంతి ట్విస్ట్... జగన్ పక్కా ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019లో ఏపీ రాజకీయాల్లో మార్పులు తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటువైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి అధికార పీఠం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని వైసీపీ అధినేత జగన్ తనదైన రీతిలో పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 125 సీట్లు సాధిస్తామని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో 2019 జనవరిలోనే మొదటి జాబితా అభ్యర్ధుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏడాదినుంచి పాదయాత్ర చేస్తూ అలుపెరుగక శ్రమిస్తున్న వైసీపీ అధినేత జగన్ సంక్రాంతి నాటికి ప్రజాసంకల్పయాత్రకు ముగింపు పలకనున్నారు. ఈ సందర్బంగా వైసీపీ కొన్ని కొసమెరుపులను మెరిపించడం గ్యారంటీ అంటున్నారు. అందులో భాగంగా జగన్ ప్రకటించబోయే అభ్యర్థుల జాబితా క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతుందంటున్నారు. 

జనవరి నాటికి ఎన్నికలు దగ్గరపడతాయి. ఫిబ్రవరి చివరి వారంనాటికి లోక్ సభ, ఏపీ శానసనసభ సార్వత్రిక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. జగన్ పాదయాత్ర ముగిసే సమయానికి జనవరి రెండో వారం వస్తుంది. కాబట్టి సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత రానుంది. తెలుగుదేశం పార్టీ కూడా జనవరిలోనే అభ్యర్థుల ప్రకటన అని అంటోంది. వంద మంది అభ్యర్థులతో చంద్రబాబునాయుడు ప్రకటన చేయనున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే అధికారికంగా ఆ మాట ఎవరూ చెప్పడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా చెప్పడం లేదు కానీ.. పాదయాత్ర ముగింపు సమయానికి తొలి జాబితా రెడీ అనే ప్రచారం అయితే సాగుతోంది. జనవరిలో అభ్యర్ధులను ప్రకటిస్తే ఎన్నికల ప్రచారానికి ఎక్కువ సమయం ఉంటుంది. తెలంగాణ తరహాలోనే ఎన్నికల నోటిఫికేషన్ నాటికి సరంజామా అంతా సిద్ధం చేసుకుంటే తమ లక్ష్యం నెరవేరుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తమ మనసులోని మాటను అధినేత చెవిలో కూడా వేశారు. చంద్రబాబుపై కోపంగా ఉన్న జగన్.. కేసీఆర్‌తో స్నేహంగా ఉంటూ.. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఏపీలో అమలుచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రైతులను ప్రసన్నం చేసుకోవడంపై జగన్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle