newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

సంక్రాంతికి దూరం... అమరావతి రైతాంగం

15-01-202015-01-2020 10:42:40 IST
2020-01-15T05:12:40.251Z15-01-2020 2020-01-15T05:12:32.030Z - - 17-01-2020

సంక్రాంతికి దూరం... అమరావతి రైతాంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏటా సంక్రాంతికి ఏపీలోని అన్ని గ్రామాలు సుభిక్షంగా, రైతులు, ప్రజలు సంతోషంగా ఉండేవారు. కానీ ఈసారి అమరావతి రాజధాని తరలింపు నిర్ణయంతో అమరావతి ప్రజలు కంటిమీద కునుకులేకుండా ఉద్యమాలు చేస్తున్నారు.ఈసారి సంక్రాంతి వారి ఇళ్ళల్లో కనిపించడం లేదు. రాజధాని రైతుల పోరు 29 వ రోజుకు చేరడంతో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పండుగ రోజున అమరావతి కోసం పోరు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. 

పోరాటమే పండుగ నినాదంతో బుధవారం ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్టు రైతులు తెలిపారు. రైతులకు మద్దతుగా సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కుటుంబసభ్యులు ఇవాళ రాజధానిలో పర్యటించనున్నారు. ఆందోళనల్లో పాల్గొననున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణి , నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు వచ్చి సంఘీభావం తెలపనున్నారు.

అమరావతిలోని రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరుల్లోనూ నేడు మహాధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. అమరావతిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు నిర్వహించి నిరసనలకు సిద్ధం అవుతున్నారు.

పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి. పోలీసులు ఈ నిరసనలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle