newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ష్..గప్‌చుప్..మూగబోయిన మైకులు..ఆగిన ప్రసంగాలు

09-04-201909-04-2019 16:59:47 IST
Updated On 09-04-2019 17:02:48 ISTUpdated On 09-04-20192019-04-09T11:29:47.252Z09-04-2019 2019-04-09T10:30:42.894Z - 2019-04-09T11:32:48.554Z - 09-04-2019

ష్..గప్‌చుప్..మూగబోయిన మైకులు..ఆగిన  ప్రసంగాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరెత్తించిన ప్రచారం సమాప్తం అయింది. పోటాపోటీ ప్రచారాలు.... విమర్శలు, ప్రతి విమర్శలు... ఆరోపణలు...ప్రత్యారోపణలు... సభలు, సమావేశాలు, ర్యాలీలు...రోడ్‌షోలు.. ఇలా అన్ని విధాల ప్రచారాలు ముగిశాయి.

Image result for shut mouth

ఎన్నికల హడావిడి, మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి అన్నీ నేటితో ముగిసిపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టానికి తెరపడింది. ఇక తొలివిడత ఎన్నికల ప్రక్రియలో కీలకమయిన పోలింగ్ ఈనెల 11న ప్రారంభం కానుంది.  

ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. 10, 11 తేదీల్లో ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీలు, అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గతంలో ఎంసీఎంసీ కమిటీ ఇచ్చిన అనుమతి మంగళవారం సాయంత్రం 6 గంటలతోనే ముగిసిపోతుందన్నారు. అంతే కాకుండా మందు బాబులకు కూడా ఈసీ షాక్ ఇచ్చింది. పోలింగ్ సందర్భంగా ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఈసి.

ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పేరు, పార్టీ గుర్తు, ఈవీఎంలో పేరు, పార్టీ గుర్తు, స్వతంత్రులు, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులైతే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఈవీఎంలో క్రమ సంఖ్య ఉండే వివరాలతో మాత్రమే ప్రకటనలు జారీ చేయాలి.

వీటికి కూడా ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తీసుకోవాలి. ఇప్పటి వరకు పార్టీలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు, డిజిటల్‌ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలి. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అలా చేస్తే కోడ్‌ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle