newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

షా సాబ్ కోసం జగన్ ఆరాటం...

12-10-201912-10-2019 10:23:45 IST
2019-10-12T04:53:45.718Z12-10-2019 2019-10-12T04:51:36.940Z - - 06-12-2019

షా సాబ్ కోసం జగన్ ఆరాటం...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి, బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడైన అమిత్ షాతో అపాయింట్ మెంట్ కావాల్సి ఉంది. అది కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షాతో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఢిల్లీలో వైసీపీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిన్న, ఈరోజు మాత్రమే కాదు గత వారం రోజులుగా అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఏపీ ప్రభుత్వ నేతలకు దొరకడం లేదు. ఎంతైనా అధికార పార్టీకి జాతీయాధ్యక్షుడు కదా అసలే రెండు రాష్ట్రాలకు ఇది ఎన్నికల సమయం.. అసలు దొరకడం లేదు.

ఈనెల మొదటి వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. నిజానికి అంతకుముందు రోజే తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా ఢిల్లీకి వెళ్లివచ్చారు. కెసిఆర్ ముందుగా ప్రధానిని కలిసి ఆ తర్వాత హోంమంత్రికి అమిత్ షాతో పాటు కొందరు మంత్రులను కూడా కలిసి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. విమానం దిగి నేరుగా ప్రధానిని కలిసి మళ్ళీ అలానే విమానం ఎక్కి బెజవాడకి వచ్చేశారు. ఆరోజు అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఉండడంతో కలవడం కుదరలేదు.

ఇక ఆ రోజు నుండే ఆయన అపాయింట్ మెంట్ కోసం జగన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తుంది. నిన్న శుక్రవారం అపాయింట్ మెంట్ ఖరారు చేయడంతో జగన్ కూడా ఢిల్లీకి రెడీ అయ్యారు. కానీ చివరి క్షణంలో అపాయింట్ మెంట్ రద్దు చేసుకొని అయన మళ్ళీ మహారాష్ట్ర వెళ్లిపోయారట. అయితే అసలు జగన్ అమిత్ షా కోసం అంతగా ఆరాటపడే అంశం ఏమై ఉంటుందా అని ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఇందుకు ప్రధాన కారణంగా రెండు అంశాలు వినిపిస్తున్నాయి. ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అంశమైతే రెండు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి.

మొదటిది జగన్ వ్యక్తిగత అంశం విషయానికి వస్తే ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసులో సిబిఐ దూకుడు పెంచింది. తాను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కనుక తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇస్తే తన లాయర్ మిగతా పనులు చూసుకుంటారన్నా సిబిఐ ససేమీరా అంటుంది. సీఎం అయినంత మాత్రాన చట్టాలు వర్తించవా.. పైగా అయన మీద నమ్మకం లేదు.. బయట ఉంటే ఏమైనా చేయగలరు అంటూ పెద్ద షాక్ ఇచ్చింది.

మరి ఒక సీఎం ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసులో కోర్టుకెలితే ప్రతిపక్షాలు ఏమంటాయి.. ప్రజలు ఏమనుకుంటారు.. అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేలా కాస్తంత సున్నితంగా మార్చుకుంటే బాగుటుందనే అంచనాల్లో అమిత్ షాతో అర్జెంట్ పని పడిందంటున్నారు.

ఇక రెండోది రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి. ప్రజల వ్యక్తిగత లబ్ది పథకాలకు రూ.వేల కోట్ల నిధులు అవసరం ఉంది. కానీ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గిపోయాయి. రావాల్సిన నిధులనైనా త్వరగా విడుదల చేసేలా కేంద్రం సహకరించాలని అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న అమిత్ షాను కోరే అవకాశం ఉందట. వీటితో పాటు రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రభుత్వంపై దాడికి సిద్దమవుతుండడం.. ప్రజలలో ప్రభుత్వాన్ని ఎండగట్టడం వంటి అంశాలపై కాస్త సున్నితంగా అమిత్ షా వద్ద అభ్యర్ధించే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

వీటన్నంటిపై హోంమంత్రిగా ఉన్న అమిత్ షాతో సమావేశమైతే పరిస్థితుల్లో కొంత మార్పు రావచ్చని వైసీపీ ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే షా మాత్రం సమయం కేటాయించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతున్నా షా సాబ్ మాత్రం దొరకడం లేదు. రెండు రాష్ట్ర ఎన్నికలు ముగిసేవరకు సీఎం జగన్ కు అయన దొరికే అవకాశం కనిపించడం లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డిది ఆరాటమే కావచ్చు.. ఆ రాష్ట్రాలలో బీజేపీ విజయం అమిత్ షాకి అవసరం కదా.. అయన లాజిక్ ఆయనకు కరక్టే మరి!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle