newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

‘షా’ దెబ్బకు.. సాయిరెడ్డికి దిమ్మతిరిగింది?

23-10-201923-10-2019 11:46:40 IST
Updated On 23-10-2019 15:36:09 ISTUpdated On 23-10-20192019-10-23T06:16:40.994Z23-10-2019 2019-10-23T06:16:31.193Z - 2019-10-23T10:06:09.332Z - 23-10-2019

‘షా’ దెబ్బకు.. సాయిరెడ్డికి దిమ్మతిరిగింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన సీఎంకి వ్యక్తిగతంగా ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొన్నారా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని 24 గంటలసేపు వేచి ఉండేలా చేసి రెండో రోజు కూడా తనకు హోంమంత్రి అమిత్ షా కేటాయించిన సమయం జగన్‌కి తీవ్ర నిరాశను కలిగించిందని తెలుస్తోంది. ఢిల్లీలో అన్నీ తానే చక్కదిద్దుతాడనుకుని కీలకపదవిలో నియమించిన విజయసాయిరెడ్డి ఈ దఫా పర్యటనలో జగన్‌కు అనుకూల వాతావరణం సృష్టించలేకపోయినందుకు జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

షాతో అపాయింట్మెంట్ మొదలుకుని భేటీ వరకూ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. కానీ భేటీ సక్రమంగా జరగకపోవడంతో విజయసాయిపై జగన్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పైగా జగన్‌తో అపాయింట్‌మెంట్లన్నీ కేంద్ర మంత్రులు రవిశంకర్‌, ప్రహ్లాద్‌జోషి రద్దు చేసుకున్నారు. అయితే.. మంత్రులు అపాయిట్మెంట్ రద్దు చేసుకోవడంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున పలు రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి.

అంతకుమించి జగన్ తాజా ఢిల్లీ యాత్రకు కేంద్రం నుంచి అనుకూల సంకేతాలు వెలువడలేదని సమాచారం. ముఖ్యమంత్రి పర్యటన పట్ల బీజేపీ నాయకత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం సంచలనం గొల్పుతోంది.  ఏపీ ముఖ్యమంత్రితో ముందే ఫిక్స్ అయిన సమావేశాన్ని కూడా అమిత్ షా 24 గంటలు వాయిదా వేయడం తర్వాత మంగళవారం కూడా పట్టుమని గంట సేపు కూడా జగన్‌కు సమయం కేటాయించకపోవడం ఏపీ ముఖ్యమంత్రిని అవమానించడమే అని చెబుతున్నారు. 

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచార ప్రక్రియతో బిజీగా ఉన్న అమిత్ షా మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో అనేకమంది ప్రముఖులతో భేటీ జరిపినప్పటికీ, ఏపీ ముఖ్యమంత్రితో సమావేశానికి పెద్దగా సమయం కేటాయించలేదు. పైగా కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషితో జగన్ అప్పాయింట్‌మెంట్లు కూడా రద్దు కావడం పలు సందేహాలకు దారితీస్తోంది. కారణాలు ఏం చెబుతున్నప్పటికీ దక్షిణాది ముఖ్యమంత్రిపై బీజేపీ నాయకత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం సమంజసం కాదని విమర్శకుల అభిప్రాయం. 

ప్రధాని మోదీ పట్ల గతంలో వ్యతిరేక వైఖరి ప్రదర్శించినందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా తొలి దఫా పాలనలో మోదీ ప్రభుత్వం తీవ్ర అనుమానాలకు గురిచేసిన విషయం తెలిసిందే. కానీ జగన్ తనపై బీజేపీ స్థానిక, జాతీయ నాయకత్వం ఎన్ని పౌరుష వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ స్పందించని, కేంద్రంతో సయోధ్యకోసమే ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్‌పట్ల బీజేపీ అధినాయకత్వం ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఆశ్చర్యహేతువే.. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేరకు ఉపయోగం అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఢిల్లీ వార్తలనుబట్టి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి అమిత్‌ షా కు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలోని హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాతో చర్చించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవా రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. ఆదాయంలో ఈ రంగాల వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని అమిత్‌ షాకి సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారుతాయని సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాకు తెలిపారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle